Gurukula jobs: గురుకుల కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు

Gurukula jobs

ఆదిలాబాద్‌టౌన్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సి పాల్‌ జె.అరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.

గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో 11వేల ఉద్యోగాలు: Click Here

జువాలజీ, కామర్స్‌లో రెండు చొప్పున, తెలుగు, స్టాటిస్టిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులతో పాటు ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు ఒక్కోటి చొప్పున ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. పీజీలో 55 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు. నెట్‌, సెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని, డెమో ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 22న అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో హాజరు కావాలని సూచించారు.

#Tags