Motivational Story : మాది నిరుపేద కుటుంబం.. ఏడాది కాలంలో ఈ మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో ప్రైవేట్ ఉద్యోగం సాధించాలంటే.. ఘ‌గ‌నం అవుతుంది. ఇంక ప్ర‌భుత్వ ఉద్యోగం అయితే.. వంద‌ల పోస్టుల‌కు ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌స్తుంటాయి. ఈ పోటీని త‌ట్టుకోని ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టితే.. ఇక లైఫ్ సెట్ అయిన‌ట్టే.

కానీ ఈ యువ‌కుడు మాత్రం ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు కేంద్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించి.. ఔరా అనిపించాడు. ఈ యువ‌కుడే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కుత్తుం గ్రామానికి చెందిన చెందిన శివంగి పరశురామ్‌. ఈ నేప‌థ్యంలో శివంగి పరశురామ్ స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

కుటుంబ నేప‌థ్యం :
శివంగి పరశురామ్‌.. శ్రీకాకుళం జిల్లా కుత్తుం గ్రామానికి చెందిన చెందిన వారు.
నిరుపేద కుటుంబానికి చెందిన వారు. పరశురాము తండ్రి శివంగి గవరయ్య. ఈయ‌న‌ కర్రమిల్లులో కార్మికుడుగా ప‌నిచేస్తున్నాడు. తల్లి పుణ్యావతి. ఈమె వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కుమార్తెకు వివాహమైంది.

☛ Inspiring Success Story : యదార్ధ కథ.. ఆక‌లి త‌ట్టుకోలేక బిక్షాటన చేసి క‌డుపు ఆక‌లి తీర్చుకునే వాళ్లం.. ఈ క‌సితోనే చ‌దివి జిల్లా ఎస్పీ స్థాయికి వ‌చ్చానిలా..

ఎడ్యుకేష‌న్ :
పరశురామ్‌.. పదో తరగతి వరకు స్థానిక శ్రీవాణి విద్యానికేతన్‌లో చదివి 9.8 మార్కులు సాధించాడు. ఇంటర్‌ నిమ్మకూరు ఏపీఆర్‌జేసీలో పూర్తి చేసి 976 మార్కులు తెచ్చుకున్నాడు. బీటెక్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ను విశాఖపట్నం అనిట్స్‌లో పూర్తిచేశాడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి శ్రమపడి బంగారు భవిష్యత్‌ను ఏర్పరచుకున్నాడు. 
 
ఏడాది కాలంలో ఈ మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల‌ను సాధించాడిలా..
శివంగి పరశురామ్‌.. గడిచిన ఏడాది కాలంలో ఈ మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇతడు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌–2023లో పరీక్ష రాసి ప్రివెంటివ్‌ ఆఫీసర్‌ (కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌) ఉద్యోగాన్ని సాధించి చైన్నె కస్టమ్స్‌ కార్యాలయంలో జాయిన్‌ అవుతున్నాడు. దీంతో పాటు ఇదే ఏడాదిలో ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌–2022లో పోస్టల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాన్ని రాజమండ్రి డివిజన్‌లో పొందాడు. అదే విధంగా ఈపీడీఎఫ్‌ఓ 2023లో సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు.

☛ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

తన తల్లిదండ్రుల కష్టం వృధా కాకూడదని శ్రమించి చదివానని, తన పేదరికమే తనను నిరంతరం ముందుకు నడిపించిందని పరశురామ్ చెప్పాడు. మూడు ఉద్యోగాల్లో ప్రివెంటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నానని, జ‌న‌వ‌రి 29వ తేదీన‌ జాయిన్‌ అవుతున్నానని చెప్పాడు.

☛ Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

#Tags