Central Govt Scholarships: సీబీఎస్‌ఈ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ పూర్తి వివరాలు ఇవే..

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ (ఎస్‌జీసీ) పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభావంతమైన విద్యార్థినుల కోసం ఈ ఉపకార వేతనాన్ని అందిస్తోంది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో... సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ పూర్తి వివరాలు..

అర్హత:

  • విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో పదకొండో తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి.
  • పదో తరగతి పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు.
  • భారతదేశ పౌరులతోపాటు ఎన్నారైలు కూడా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఎన్‌ఆర్‌ఐల ట్యూషన్‌ ఫీజు రూ.6000కు మించకూడదు.

Vacancies In ECIL: డిప్లొమా/బీటెక్‌ అర్హతతో ఈసీఐఎల్‌లో ఖాళీలు.. నోటిఫికేషన్‌ పూర్తి వివరాలివే

స్కాలర్‌షిప్‌ మొత్తం:

స్కాలర్‌షిప్‌కి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేయించుకోవాలంటే.. విద్యార్థిని కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ

  • పదోతరగతిలో 60 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు పొందాలి.
  • సీబీఎస్‌ఈ అనుబంధ స్కూల్స్‌లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతుండాలి.
  • విద్యార్థిని వారి తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె అయి ఉండాలి. దానికి సంబంధించి సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫార్మెట్‌లో ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ /ఎస్‌డీఎం /ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌/నోటరీ అటెస్ట్‌ చేసిన ఒరిజినల్‌ అఫిడవిట్‌ను సమర్పించాలి. 
  • ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌తో అటెస్టేషన్‌ చేయించాల్సి ఉంటుంది.

CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి

 

  1. CBSE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. 'సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ X-2024 REG.'ని ఎంచుకోండి.
  3. 'Fresh Application'లేదా'Renewal'లో మీకు కావల్సిన దానిని ఎంచుకోండి
  4. ఫారమ్‌ను పూర్తి చేసి, పత్రాలను అప్‌లోడ్ చేసి, సమర్పించండి.
  5. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి

School holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూళ్లకు వరుసగా సెలవులు.. ఎందుకంటే!

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుకు చివరితేదీ: 23.12.2024
  • వెబ్‌సైట్‌: https://www.cbse.gov.in/

మరిన్ని వివరాలకు: CBSE Scholarship official website https://cbseit.in/cbse/2024/sgcx/default.aspx

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags