CBSE To Introduce Two Level Paper For Science, Social Science: విద్యార్థులకు సీబీఎస్‌ఈ గుడ్‌న్యూస్‌.. ఈజీ/టఫ్‌..నచ్చిన పేపర్‌ను ఎంచుకోవచ్చు!

విద్యార్థులకు సీబీఎస్‌ఈ గుడ్‌న్యూస్‌ తెలిపింది. సైన్స్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌ పరీక్షల్లో టూ లెవల్‌ నమూనాను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని ప్రకారం.. ఎగ్జామ్‌ పాటర్న్‌లో బేసిక్‌ అండ్‌ స్టాండర్డ్‌ అని రెండు లెవల్స్‌ ఉంటాయి. బేసిక్‌ విధానంలో.. ప్రశ్నల తీరు సింపుల్‌గా ఉంటుంది. అదే స్టాండర్డ్‌ ఎంచుకుంటే పేపర్‌ కఠినంగా ఉంటుంది.
CBSE To Introduce Two Level Paper for Science, Social Science in Classes 9 and 10

పదో తరగతి తర్వాత కూడా అదే సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలనుకునే వారు సాధారణంగా స్టాండర్డ్‌ పేపర్‌ను ఎంచుకుంటారు. విద్యార్థులు వారి వారి ఆసక్తి, సామర్థ్యాలను బట్టి ఏ పరీక్ష రాయాలన్న విషయాన్ని నిర్ణయించుకోవచ్చు.

Job Mela: డిగ్రీ అర్హతతో మేనేజర్‌ పోస్టులు.. పూర్తి వివరాలివే!

ఇప్పటికే బోర్డ్ పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు గణితంలో ఈ టూ- లెవల్‌ ఎగ్జామ్‌ రాసే వెసులుబాటు ఉందనే విషయం తెలిసిందే. 2020 నుంచి విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఈ అవకాశం కల్పిస్తోంది. అయితే ఇప్పుడు 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9,10వ తరగతి విద్యార్థులకు సైన్స్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌లో సైతం ఈ తరహా పరీక్షలకు అవకాశం ఇవ్వాలని సీబీఎస్‌ఈ భావిస్తోంది.

Free Training: నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి కోర్సులలో శిక్షణ

ఈ ప్రతిపాదనపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే దీనిపై  తుది నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్‌ పేర్కొంది. దీంతో పాటు అడ్వాన్స్‌డ్ స్థాయికి కేవలం పరీక్ష పాటర్న్‌ మార్చాలా లేదా సిలబస్‌ కూడా మార్చాలా అనేదానిపై కూడా బోర్డు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొంది. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags