AP Assembly Budget Session Live Updates: ఏపీ అసెంబ్లీ 2024 బడ్జెట్‌ సమావేశాలు.. అప్‌డేట్స్ ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ ప్రారంభమయ్యాయి.

ఈ నెల 8వ తేదీ వరకూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.  

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం..

  • ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది
  • రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌
  • 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం
  • రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3040 కేసులు
  • పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం
  • ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించాం
  • పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత
  • పీడీఎఫ్‌ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం
  • పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ 74.01 శాతం పూర్తి
  • ఎల్‌ఏ అండ్‌ ఆర్‌ ఆర్‌ పనిలో 22.42 శాతం పూర్తి
  • జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోంది
  • జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం
  • వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం
  • నాన్‌ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం
  • 2023-24లో 268 కి.మీ పొడవునా 58 బీటీ రోడ్లు వేశాం
  • రూ. 71 ‍కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల కొనుగోలు
  • దీని ద్వారా 3, 27, 289 మంది తల్లులకు లబ్ది
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నాం
  • 2024 జనవరి 1వ తేదీ నుంచి రూ. 3వేలు పెన్షన్‌ అందిస్తున్నాం
  • నెలవారీ పెన్షన్‌ బడ్జెట్‌ రూ. 1961 ​కోట్లకు పెరిగింది
  • ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ మొబైల్‌ డిస్పెన్సింగ్‌ ఓనర్లకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 4,969.05 కోట్లు
  • వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ. 14, 129 కోట్లు పంపిణీ
  • వైఎస్సార్‌ కాపునేస్త కింద రూ. 2, 029 కోట్లు జమ
  • వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్నాం
  • ఐదేళ్లలో రూ. 75 వేలు అందిస్తున్నాం
  • 3, 57, 844 మంది అర్హుల ఖాతాల్లో రూ. 2,029 కోట్లు జమ
  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద రూ. 1,257.04 కోట్లు జమ
  • మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి
  • రాష్ట్రంలో 55,607 మెయిన్‌, మినీ అంగన్‌ వాడీ కేంద్రాలు
  • వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28. 62లక్షల మంది పిల్లలకు లబ్ధి
  • పౌష్టికాహార పథకాలకు రూ. 6,688 కోట్లు
  • అంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 21.82 కోట్ల విలువైన గ్రోత్‌ మానిటరింగ్‌ పరికరాలు అందించాం
  • వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం
  • 78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు
  • ఆక్వా రైతుల విద్యుత్‌ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించాం
  • రూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు
  • 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్‌
  • రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాలో ఆక్వా హబ్‌ ఆఫ్ఇం‌ డియాగా ఏపీ
  • మత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించాం
  • మత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్ధిదారుల రూ. 540 కోట్ల జమ
  • చేపల వేట నిషేధ కాలంలో పరిహారం రూ. 10 వేలకు పెంచాం
  • చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాం
  • ఫిషింగ్‌ బోట్లకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చాం
  • రైతులు రాష్ట్రానికి వెన్నుమక
  • 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు
  • 10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
  • ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం
  • రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నాం
  • రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం
  • 22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చాం
  • మిచాంగ్‌ తుపానులో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం
  • నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో మెరుగు
  • 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి
  • 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు
  • రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు
  • ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాం
  • ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించాం
  • ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
  • మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన
  • 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశాం
  • వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం
  • ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం
  • విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు
  • అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు
  • ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నాం
  • ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గాయి
  • ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
  • 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌
     
  • 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం
  • పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం
  • ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశాం
  • జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నాం
  • జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశాం
  • విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనది
  • మా ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టింది
  • సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోంది
  • విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం
  • అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయం
  • బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • జగన్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వం
  • ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నాం
  • నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి
  • నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
  • దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు
  • పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నాం
  • మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చాం
  • విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశాం

మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు: మంత్రి అంబటి

  • అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్‌.. 
  • హామీల అమలుపై చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారు 
  • దేశంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ 
  • మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు 
  • మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది 
  • రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను గెలవబోతున్నాము 
  • సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్‌ వెళ్ళాడు 
  • పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టే 
  • జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా నిద్రమేలుకోవాలి 
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారు 
  • దుష్టచతుష్టయం పన్నే పద్మవ్యూహాలని ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్ 
  • లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని దాచేసారు 
  • టికెట్ లేదని చెబితే బఫున్లు పార్టీలు మారుతారు 
  • బాలశౌరీ అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్‌
  • బాలశౌరీ ఎరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి

► అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్ని­కలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు.

► ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ద్వారా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది. 

Interim Budget 2024: 2024 బడ్జెట్ పూర్తి వివ‌రాలు.. తెలుగు రాష్ట్రాల‌కి ఇచ్చిన రైల్వే బడ్జెట్ ఎంతంటే..?

#Tags