IBPS 4455 Jobs Notification 2024 Details : 4455 పీవో, ఎస్‌ఓ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. సిల‌బ‌స్.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశంలోని 11 బ్యాంకుల్లో 4455 పీవో, మేనేజ్‌మెంట్ ట్రైనీస్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టుల‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగ‌స్టు 21వ తేదీ వరకు దరఖాస్తు చేయకోవచ్చు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎక్కువ‌గా ఖాళీలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ  ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు.

అర్హ‌త‌లు ఇవే..
పోస్టుల‌ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప‌రీక్ష‌లు, ఫ‌లితాల విడుద‌ల తేదీలు ఇవే..
☛ పీఓ పోస్టులకు అక్టోబర్‌లో,  ఎస్‌ఓ పోస్టులకు నవంబర్‌లో ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల‌ను నిర్వహించ‌నున్నారు.
☛  పీఓ నవంబర్‌లో, ఎస్‌ఓ నవంబర్‌/డిసెంబర్‌లో ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.
☛ మెయిన్స్‌ పరీక్ష తేదీల తేదీలు : పీఓ పోస్టులకు నవంబర్‌లో; ఎస్‌ఓ పోస్టులకు డిసెంబర్‌లో.
☛  పీఓ- డిసెంబర్‌/జనవరి 2025లో; ఎస్‌ఓ- జనవరి/ఫిబ్రవరి 2025లో మెయిన్స్ మెయిన్స్‌ ఫలితాలను విడుద‌ల చేయ‌నున్నారు.
☛ పీఓ- జనవరి/ఫిబ్రవరి 2025; ఎస్‌ఓ- ఫిబ్రవరి/మార్చి 2025లో  ఇంటర్వ్యూ నిర్వ‌హించ‌నున్నారు.
☛  ఏప్రిల్‌, 2025లో ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్ ఇవ్వ‌నున్నారు.

వయ‌స్సు : 
పీఓ, ఎస్‌ఓలకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : 
పోస్టును అనుసరించి ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

IBPS 4455 Jobs Notification 2024 Full Details : 

#Tags