APPSC Recruitment: ఏపీలో ఉద్యోగాల భర్తీకి 6 నోటిఫికేషన్లు విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) వరుసగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీ ఏపీపీఎస్సీ కొత్తగా వేరువేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి ఆరు నోటిఫికేషన్ల‌ను విడుదల చేసింది. 

కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2లో 18 పోస్టులు, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్ పోస్టులు 7, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో 4 లైబ్రేరియన్ పోస్టులు, వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్‌ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌.. సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో 2 అసిస్టెంట్‌ డైరెక్టర్ పోస్టులు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌కు సంబంధించి ఒక పోస్టు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్ర‌ధించండి. 

 

#Tags