AP TET Total Applications 2024 : ఏపీ టెట్‌కు భారీగా దరఖాస్తులు.. ఈ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు.. కానీ..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ టెట్‌-2024 ప‌రీక్ష‌ల‌కు భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 4,27,300 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

పేప‌ర్‌-1 (ఎ) సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ విభాగంలో 1,82,609మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పేప‌ర్‌-2 సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 1- బికు 2,662 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. 

స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే.. సోషల్‌ స్టడీస్‌కు సంబంధించి 70,767మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 2-బి విభాగంలో 2,438మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ టెట్ Hall tickets 2024ని కూడా ప‌రీక్ష‌కు వారం ముందు విడుద‌ల చేయ‌నున్నారు.

అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు..
గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు పరీక్షలు నిర్వహిస్తామని.. అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉండటంతో.. భారీగా..
డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు పోటీపడుతున్నవారి సంఖ్య భారీగా ఉంది. రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీకి సిద్ధమైన ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మొత్తం 16347 టీచ‌ర్ పోస్టులు.. జిల్లాల వారిగా ఖాళీల వివ‌రాలు ఇవే..

16,347 టీచ‌ర్‌ పోస్టులకు జులై 1వ తేదీ DSC 2024 షెడ్యూల్ విడుదల కానున్న విష‌యం తెల్సిందే. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఏపీ డీఎస్సీ-2024 పోస్టుల వివరాలు ఇవే :

  పోస్ట్  ఖాళీలు
1 ఎస్‌జీటీ 6,371
2 పీఈటీ 132
3 స్కూల్‌ అసిస్టెంట్స్‌ 7725
4 టీజీటీ 1781
5 పీజీటీ 286
6 ప్రిన్సిపల్స్‌ 52

ఏపీలోని జిల్లాల వారిగా టీచ‌ర్ పోస్టుల‌ ఖాళీల వివ‌రాలు ఇవే..

  జిల్లా ఖాళీలు
1 శ్రీకాకుళం 543
2 విజ‌య‌న‌గ‌రం 583 
3 విశాఖప‌ట్నం 1134 
4 తూర్పు గోదావ‌రి 1346 
5 పశ్చిమ గోదావ‌రి 1067
6 కృష్ణా 1213 
7 గుంటూరు 1159
8 ప్రకాశం 672
9 నెల్లూరు 673 
10 చిత్తూరు 1478
11 కడప 709 
12 అనంతపురం 811
13 కర్నూలు 2678

అలాగే రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.

#Tags