AP TET 2024 Total Applications 2024 : టెట్ అభ్య‌ర్థుల‌కు అలర్ట్‌.. టెట్‌ దరఖాస్తుల గడువు పెంపుపై క్లారిటీ.. అప్లికేషన్స్ ఇంతే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024 ద‌ర‌ఖాస్తు గడువు ఆగ‌స్టు 3వ తేదీతో ముగియ‌నున్న‌ది.

టెట్ దరఖాస్తుల గడువును పొడిగించ‌డం లేద‌ని..ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. టెట్ ప‌రీక్ష‌కు అర్హులైన అభ్యర్థులు గడువు ముగిసేలోపు టెట్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు విజయరామరాజు ఒక ప్రకటన విడుదల చేశారు.

☛ AP TET 2024 Notification : ఏపీ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష విధానాలు, ఎంపిక ఇలా..

ఇప్ప‌టి వ‌ర‌కు 3,20,333 ద‌ర‌ఖాస్తులు.. ఇంకా..
ఇప్పటివరకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. అలాగే ఇంకా ద‌ర‌ఖాస్తుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. 

టెట్‌ ప‌రీక్ష హాల్‌ టికెట్లుల‌ను..
ఈ టెట్‌ ప‌రీక్ష‌ సీబీటీ విధానంలో 2024 అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయ‌న తెలిపారు. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

#Tags