AP TET Exam Centers : ఏపీ టెట్‌కు మూడు సెంట‌ర్ల ఏర్పాటు..

అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 8,870 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు డీఈఓ సుధాకర్‌రెడ్డి.

నంద్యాల: జిల్లాలో ఏపీ టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (2024)కి మూడు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 8,870 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అయ్యలూరు మెట్ట సమీపంలోని ఎస్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, నెర్రవాడలోని శాంతిరాం ఇంజినీరింగ్‌ కాలేజీ, ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కాలేజీలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షకు సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించరన్నారు.

Scholarships Program : సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఉప‌కార వేత‌నాల పండుగ‌

నామినల్‌ రోల్స్‌లో వివరాలు మార్చుకునేందుకు తగిన ధ్రువపత్రాలతో టెట్‌ పరీక్ష కేంద్రంలోని డిపార్టుమెంటల్‌ అధికారులను సంప్రదించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డిప్యూటీ డీఈఓ మహబూబ్‌బేగ్‌ (సెల్‌: 9440360042), ఏఎస్‌ఓ కైసర్‌ అహమ్మద్‌ (8179855575)ను సంప్రదించాలన్నారు. డీఈఓ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags