Free Coaching for TET Candidates : ఏపీ టెట్‌కు ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఉచిత శిక్షణ..
గుంటూరు: మైనార్టీల ప్రాంతీయ విద్యాభివృద్ధి కేంద్ర (ఆర్సీఈడీఎం) ఆధ్వర్యంలో ఏపీ టెట్‌కు సన్నద్ధమవుతున్న మైనార్టీ విద్యార్థులకు పొన్నూరు రోడ్డులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఎండీ మస్తాన్‌వలి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లిం, క్రైస్తవ, పార్సీ, సిక్కు, జైన, బౌద్ధ అభ్యర్థులకు ఉర్దూ, తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉచిత శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న ఉచిత శిక్షణ కోసం టెట్–2024 ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం జిరాక్స్, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఆంధ్ర ముస్లిం కళాశాలలో లేదా 90308 72696, 94414 53256, 81259 07579 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
NEET Paper Leak : నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వంపై....
#Tags