AP Grama Ward Sachivalayam Employees : ఏపీ గ్రామ‌/వార్డు సచివాలయాల‌ ఉద్యోగుల‌కు మ‌రో కొత్త ట్విస్ట్..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ గ్రామ‌/వార్డు సచివాలయాలకు కూట‌మి ప్ర‌భుత్వం చుక్క‌లు చూపింస్తుంది. రోజుకు ఎదో ఒక్క కొత్త నిబంధ‌న‌తో ఉద్యోగులను ఇబ్బందికి గురిచేస్తుంది.

ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వంలో వీరి ప‌రిస్థితి అయోమ‌యంలో ఉంది. తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగుల బదిలీల్లో సచివాలయాల ఉద్యోగుల బదిలీకి అనుమతి ఇచ్చింది. ఈ నెలాఖరు లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

☛➤ AP Grama and Ward Sachivalayam Employees Reforms 2024 : కీలక‌ నిర్ణ‌యం.. ఏపీ గ్రామ‌/వార్డు సచివాల‌యాల్లో ఈ పోస్టులను రద్దు..! ఇంకా..

వీరికి ఇది వ‌ర్తించ‌దు.. కానీ..

అయిదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధన సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయంలో డైలమాకు కారణం అవుతోంది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో 2024 జూలై 31 నాటికి అయిదేళ్ల పాటు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ వర్తిస్తుందన్న ప్రభుత్వ నిబంధనతో వీరు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.34 లక్షల మంది సచివాలయాల ఉద్యోగుల్లో లక్ష మందికి పైగా సర్వీసు అక్టోబర్ 1, 2024 నాటికి అయిదేళ్లు పూర్తవుతుంది. ప‌రిపాలనా సౌలభ్యం పేరుతో బదిలీ చేసే వీలున్నా కొద్ది మందికే అవకాశం దక్కనుంది.

☛➤ APPSC Jobs Notifications 2024 Mistakes : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, 2 సహా 21 నోటిఫికేషన్లు.. ఈ పరీక్షలకు కనీసం తేదీలు కూడా..

➤☛ AP Grama Ward Sachivalayam Employees New Rules 2024 : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కొత్త డిమాండ్స్ ఇవే.. మాకు ఇవి కావాల్సిందే..!

భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులైన వారికి..
అయిదేళ్ల సర్వీసు పూర్తి కానందున మిగిలిన వారు దరఖాస్తు చేసుకున్న పరిగణలోకి తీసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో, మండల.. జిల్లాయేతర ప్రాంతాల్లో నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్న‌ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఏడాది క్రితం నిర్వహించిన బదిలీల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతే కాకుండా భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులైన వారికి బదిలీకి వెసులుబాటు కల్పించినా కొద్ది మందికే అవకాశం దక్కింది. ఉద్యోగుల్లో అత్యధికులు అవివాహితులు కావటం మరో కారణంగా చెబుతున్నారు.

➤☛ AP Grama & Ward Volunteers : వాలంటీర్ల విష‌యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఇక‌పై వీరిని..

బదిలీలకు కటాప్ తేదీని..
ప్రభుత్వం తాజాగా ఖరారు చేసిన మార్గదర్శకాల్లో అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధనతో ఇప్పటి వరకు 4 ఏళ్ల 9 నెలల సర్వీసు పూర్తి చేసుకున్న సచివాలయాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు కటాప్ తేదీ అక్టోబర్ లేదా నవంబర్ కు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఈ ఆగ‌స్టు నెలాఖరు నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు కుట‌మి ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంది.

➤ Amma ki Vandanam Scheme : అమ్మ‌కు వంద‌నం.. అంతా మాయ..? ప్ర‌తి విద్యార్థికి రూ.15 వేలు ఇంకెప్పుడు..?

#Tags