AP Grama Ward Sachivalayam Employees New Rules 2024 : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కొత్త డిమాండ్స్ ఇవే.. మాకు ఇవి కావాల్సిందే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్ర‌స్తుతం కొత్త ప్ర‌భుత్వంలో ఉద్యోగం చేయ‌డం చాలా క‌ష్టంగా మారింది. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగ‌స్టు 5వ తేదీన (సోమ‌వారం) సమావేశం నిర్వహించారు.

ఈ స‌మావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావలసిన బకాయిల్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలన్నారు.

➤☛ AP Grama & Ward Volunteers : వాలంటీర్ల విష‌యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఇక‌పై వీరిని..

గ్రామ, వార్డు సచివాలయాల సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి, పదోన్నతులు కల్పించాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్నీ కూడా.. గ్రామ్‌/వార్డు సచివాలయ ఉద్యోగులకు కచ్చితంగా వర్తింప చేయాల‌ని డిమాండ్ చేశారు. 

➤ Amma ki Vandanam Scheme : అమ్మ‌కు వంద‌నం.. అంతా మాయ..? ప్ర‌తి విద్యార్థికి రూ.15 వేలు ఇంకెప్పుడు..?

తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా..

ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కొన్ని సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. అలాగే ఈ సమస్యలపై, ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి, సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా.. కూట‌మి ప్ర‌భుత్వంలోని ముఖ్యమైన‌ నాయ‌కుల‌కు విజ్ఞప్తి పత్రాలను అందచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

 AP Grama/Ward Volunteers Demands 2024 : గ్రామ‌/వార్డు వలంటీర్లుకు.. రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే.. ఇంకా..!

#Tags