Polycet 2022: పాలీసెట్ పరీక్ష సమాచారం
విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మే 27న ఆయన మీడియాతో మాట్లాడారు. మే 29 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్ జరుగుతుందన్నారు. పది గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటోలు సరిగా లేని విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. విద్యార్థులతోపాటు బాల్ పెన్ను, పెన్సిల్, రబ్బరును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. 2022 పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,37,371 మంది విద్యార్థులు పాలీసెట్‌కు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష పూర్తి అయిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు.
చదవండి:
GT Course: మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జీటీ కోర్సు