AP SI Jobs 2023 : ఎస్‌ఐ నియామక ప్ర‌క్రియ‌లో కొత్త ట్వీస్ట్‌ .. కోర్టు ప‌రిధిలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎస్సై పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియకు ఏపీ రాష్ట్ర హైకోర్టు స్టే ఆర్డ‌ర్‌తో తాత్కాలికంగా బ్రేక్ పడిన విష‌యం తెల్సిందే.

అయితే ఈ ఎస్ ఉద్యోగాల కొల‌త‌ల‌పై  ఏపీ రాష్ట్ర హైకోర్టు న‌వంబ‌ర్ 25వ తేదీ (శ‌నివారం) కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది. కోర్టు ప‌రిధిలోనే ఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ ఛాతీ, ఎత్తు కొల‌వాల‌ని హైకోర్టు ఆదేశించింది.

➤ AP SI Mains Exam 2023 Question Paper- III కోసం క్లిక్ చేయండి

➤ AP SI Mains Exam 2023 Question Paper-III Key కోసం క్లిక్ చేయండి

➤ AP SI Mains Exam 2023 Question Paper-IV కోసం క్లిక్ చేయండి

➤ AP SI Mains Exam 2023 Question Paper-IV Key కోసం క్లిక్ చేయండి

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సివిల్‌, రిజర్వ్ విభాగాల్లోని 411 పోస్టుల భర్తీకి ఈ ఏడాది పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నియామకాల్లో అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టు కోర్టును ఆశ్రయించిన విష‌యం తెల్సిందే. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్‌ వేశారు.

ప్రాథమిక రాత పరీక్షకు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 57 వేల మందికిపైగా అర్హత సాధించారు. అనంతరం వీరికి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో దాదాపు 35 వేల మంది పురుషులు, మహిళలు అర్హత సాధించారు. వీరికి గత నెల 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించగా.. 30 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని అక్టోబరు 15న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 18 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ కీతోపాటు మెయిన్ పరీక్షల ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఏపీ రాష్ట్ర హైకోర్టు తాజా ఆదేశాల‌తో..ఈ ఫ‌లితాల విడుద‌లకు మార్గం సుగుమం అయ్యే అవ‌కాశం ఉంది.

➤ AP SI Main Exam 2023 All Codes Questions Papers & Key (Click Here)

#Tags