Jobs In ICDS: ఐసీడీఎస్‌లో వివిధ పోస్టుల భర్తీ.. ఈనెల 23న కంప్యూటర్‌ టెస్ట్‌

చిత్తూరు : ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన కంప్యూటర్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఐసీడీఎస్‌ పరిధిలో వివిధ పోస్టులకు అర్హుల జాబితాను www.chittoor.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేశామన్నారు.

Army Recruitment Rally: 26 నుంచి భారీగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

జాబితాలో పేరు ఉన్నవారు ఎస్వీ సెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించే కంప్యూటర్‌ టెస్ట్‌కు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్‌ ఆధార్‌కార్డు, ఓటరు కార్డు, పాన్‌కార్డు తీసుకురావాలని స్పష్టం చేశారు.
 

#Tags