AP Inter New Rules : ఇక‌పై ఏపీ ఇంట‌ర్ విద్యార్థుల‌కు రానున్న‌ కొత్త రూల్స్‌... ప్రశ్నపత్రాల్లో మార్పులు ఇలా...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం కొత్త రూల్ తీసుకోచ్చింది. పాఠశాలల్లో విద్యార్థులకు మాదిరిగా.. ఇక‌పై ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రోగ్రెస్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికే ప్రోగ్రెస్ కార్డు నమూనాను కాలేజీలకు పంపించారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకోస్తామన్నారు.  

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

వచ్చే ఏడాది నుంచే ఇంట‌ర్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌..
వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులకు తెల్లరంగు, జనరల్‌లో ఫస్టియర్ వారికి లేత పసుపు, సెకండియర్ వారికి లేత నీలం రంగు కార్డులను ముద్రించి, ఇవ్వాలని సూచించారు. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

అక్టోబరు 15 నుంచి 21 వరకు ప‌రీక్ష‌లు : 
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే సెకండియర్ వారికి ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు రోజుకో పరీక్ష నిర్వహిస్తారు

#Tags