After 10th Bipc Courses Benefits : ఇంట‌ర్‌లో 'బైపీసీ' కోర్సు తీసుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగాలు ఏటంటే..?

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో పాస్ అయిన త‌ర్వాత విద్యార్థి మదిలో.. ‘పది’ పాసయ్యాను సరే! మరి తర్వాత ఏం చేయాలి? ఇంటర్‌లో చేరాలా? చేరితే ఏ గ్రూపులో చేరాలి?
After 10th Bipc Courses Benefits

ఒకేషనల్ కోర్సులో చేరితే ఏ ట్రేడ్‌ను ఎంపిక చేసుకోవాలి? తమకు సరితూగే కోర్సు ఏది? ఇలా మొద‌లైన ఆలోచ‌న‌లు ఉంటాయి. మీ మ‌న‌స్సులో ఇంట‌ర్‌లో బైపీసీ కోర్సును తీసుకోవాల‌నుకుంటున్నారా..! అయితే ఈ కోర్సు తీసుకోవ‌డం వ‌ల్ల‌ భవిష్యత్తు అవకాశాలు.. ఈ కోర్సును ఎంచుకోవడానికి ఉండాల్సిన లక్షణాలు తదితర అంశాలపై స‌మ‌గ్ర‌ విశ్లేషణ.. మీకోసం..

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

గ్రూప్‌దే కీలక పాత్ర‌.. కానీ..
పదో తరగతి పూర్తయిందంటే.. కోరుకున్న కెరీర్‌ను సాధించే క్రమంలో తొలి అడుగు పడినట్లే. అనుకున్న సమయంలో లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇంటర్మీడియెట్‌లో ఎంపిక చేసుకునే గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అమ్మానాన్న, స్నేహితులు, సీనియర్లు, శ్రేయోభిలాషుల సలహాలను పరిగణనలోకి తీసుకుంటూనే స్వీయ సామర్థ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలి.

MPC Course Benefits : ఇంట‌ర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగాలు ఇవే..

బైపీసీతో ఉప‌యోగాలు ఎన్నో..
బైపీసీ విద్యార్థులు రెండేళ్ల ఇంటర్మీడియెట్‌లో భాగంగా బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదువుతారు. నేచురల్ సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న వారికి సరైన గ్రూప్ బైపీసీ. మొక్కలు, జంతువుల స్థితిగతులను పరిశీలించడం ఇష్టమున్న వారు ఈ గ్రూప్‌లో చేరొచ్చు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని అధ్యయనం చేయాలి కాబట్టి కష్టపడి చదివే తత్వం ఉండాలి. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాలను ప్రయోగశాలలో పరిశీలించేలా సన్నద్ధత అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, నీట్‌, జిప్‌మర్, సీఎంసీ, ఎయిమ్స్ వంటి పరీక్షల్లో ప్రతిభ కనబరచడం ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్ కెరీర్‌లో స్థిరపడేందుకు అధిక సమయం అవసరం. ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ మెడిసిన్ (సూపర్ స్పెషాలిటీ) కోర్సు చేయాలి. దీనర్థం బైపీసీ గ్రూప్‌లో చేరొద్దని కాదు! కుటుంబ ఆర్థిక పరిస్థితి, స్వీయ ఆసక్తి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. బైపీసీ తర్వాత బీడీఎస్, పారామెడికల్, అగ్రికల్చర్, హోమియోపతి తదితర కోర్సుల్లోనూ చేరొచ్చు. లేదంటే యూజీ స్థాయిలో నచ్చిన గ్రూప్‌లో చేరొచ్చు. తర్వాత పీజీ, పరిశోధనలు దిశగా అడుగులు వేయొచ్చు.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఇవి తప్పనిస‌రిగా..
మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండాలి. అలాగే నైపుణ్యాలను పెంపొందించుకోవడం తప్పనిసరి. ప్రాక్టికల్స్ ద్వారా జ్ఞాన సముపార్జన అవసరం. ఓర్పు, సహనం, కష్టపడేతత్వం అనేవి బైపీసీ విద్యార్థులకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు.

​​​​​​ఇంట‌ర్‌కు సంబంధించిన‌ స‌మ‌గ్ర స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

#Tags