AP DSC 2024 Postpone : డీఎస్సీ-2024 వాయిదా..? కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ఏపీ డీఎస్సీ-2024 వాయిదా ప‌డే అవ‌కాశం స్ప‌ష్టంగా కన్పిస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విషయం తెల్సిందే.

మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని ఏపీ విద్యాశాఖ అధికారులు ఇప్ప‌టికే తేదీల‌ను కూడా ప్ర‌క‌టించారు. అయితే చాలా మంది డీఎస్సీ అభ్య‌ర్థులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను డీఎస్సీ ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌మ‌ని అభ్య‌ర్థించారు.

అయితే ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఇది మా ప‌రిధిలో ఉండ‌ద‌ని.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఒప్పుకుంటే వాయిదా వేస్తామ‌ని అభ్య‌ర్థులకు తెలిపింది. దీనిపై ఇంకా ఏపీ విద్యాశాఖ క‌మిష‌న్ ఇంకా ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌లేదు.

డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నాం. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుంద‌ని ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

#Tags