AP DSC -2024 Notification : ఏపీ డీఎస్సీ-2024 పై కీల‌క నిర్ణయం.. జూలై 1వ తేదీ నుంచి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో ఏపీ డీఎస్సీ-2024పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూలై 1వ తేదీ నుంచి డీఎస్సీ-2024 ప్ర‌క్రియ ప్రారంభ‌మై.. డిసెంబ‌ర్ 10వ తేదీలోపు పూర్తి చేస్తామ‌న్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 16,347 పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ-2024పై తొలి సంత‌కం చేసిన విష‌యం తెల్సిందే. దీనిపై ఏపీ ఏపీ క్యాబినెట్‌లో దీనిపై విధివిధాన‌లు చ‌ర్చించారు. కొత్త‌గా టెట్ నిర్వ‌హించాలా.. లేదా టెట్ లేకుండానే డీఎస్సీ నిర్వ‌హించాలా..అనే రెండు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి. దీని మంత్రి వ‌ర్గం చ‌ర్చించింది తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

☛ AP DSC-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఏపీ క్యాబినెట్‌లో ఇంకా తీసుకున్న నిర్ణ‌యాలు ఇవే..
మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై ఐదు సంతకాలు చేశారు. ఈ క్యాబినెట్‌ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సూపర్‌ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించారు. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్య‌మంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. 

#Tags