Free Coaching: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌.. ఎవరు అర్హులంటే..

ముంచంగిపుట్టు: మండల కేంద్రం మంచంగిపుట్టులో గల ఆదివాసీ విద్యా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు ఉచిత కోచింగ్‌ అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధి బి.బాబూరావు తెలిపారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలకు చెందిన గిరిజన యువతీ,యువకులకు ఈ నెల 7వ తేదీనుంచి ఉచితంగా కోచింగ్‌ ఇస్తామన్నారు. స్థానిక ఇంజనీరింగ్‌ కార్యాలయం వద్ద ఉన్న ఆదివాసి విద్యా ఫౌండేషన్‌ భవనంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9014746943 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags