ఆహార భద్రత

ముఖ్యాంశాలు:

  1. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు ఆహార కొరత తీవ్రంగా ఉండే పరిస్థితులు - కరువులు, ఆకలి చావులు ఎక్కువగా ఉండేవి.
  2. పాలకులు ఆహార ధాన్యాల సరఫరా చేయలేకపోవడంతో కరువులు సంభవించిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయి.
  3. ఆహార భద్రతకు సరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం ముఖ్యమైన అవసరం. హెక్టారుకు లభించే పంట దిగుబడిని పెంచడానికి అవసరమైన ఉత్పాదకాలను సక్రమంగా వినియోగించుకోవాలి. సాగునీటి వసతిని పెంపొందించాలి.
  4. ఆహార వినియోగంలో మార్పులు వచ్చి పళ్లు, కూరగాయలు, పాలు, మాంసం, కోడిమాంసం, చేపలు ప్రజలు కోరుకుంటున్నారు. వినియోగదారులు రకరకాల ఆహార పదార్థాలతో సమతుల ఆహారం తీసుకోవాలి.
  5. ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టడానికి రైతులకు ఉత్పాదకాలు మార్కెటు అవకాశాల రూపంలో మద్దతు కావాలి. కొత్త పరిస్థితిలో రైతులు ఎదుర్కొనే మార్కెటు ఒడిదుడుకుల నుంచి రైతులకు రక్షణ, మద్దతు అవసరమవుతాయి.
  6. ఆహార భద్రతలో తరువాత ముఖ్యమైన అంశం ఆహార అందుబాటు. ఆహార ధాన్యాలు, ఇతర పదార్థాలు ఉత్పత్తి చేసి ప్రతి ఒక్కళ్లు వాటిని కొని, వినియోగించే స్థితిలో ఉండాలి.
  7. భారతదేశంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండడానికి ప్రజలకు చౌక ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  8. అధిక శాతం ప్రజలు వారికి కావాల్సిన దానికంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నారు.
  9. పిల్లల్లో, వయోజనుల్లోను తక్కువ బరువు సమస్య తీవ్రంగా ఉందని పోషకాహార నివేదిక తెలియజేస్తున్నాయి.
  10. దేశంలో సరిపడేంత ఆహార నిల్వలు ఉన్నప్పటికీ చాలా మంది ప్రజలు ఆకలితో ఉంటూ పోషకాహార లోపానికి గురవుతున్నారు.

కీలక పదాలు

  1. ఉత్పత్తి: ఆహార భద్రతకు సరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం. అధిక మొత్తంలో ఆహార పదార్థాలను రైతులు పండించగల పరిస్థితులను భారతదేశ ప్రభుత్వం కల్పించాలి.
  2. లభ్యత, అందుబాటు: ఉత్పత్తి అయిన ధాన్యం ప్రజలందరికి అందుబాటులో ఉంచాలి. మార్కెట్‌లో కొనడంద్వారా, చౌక ధరల దుకాణం, మధ్యాహ్న భోజనం వంటి పథకాల ద్వారా ఆహారం అందుబాటులోకి రావాలి.
  3. పోషకాహారం: శరీరం అన్ని విధులు నిర్వహించడానికి- శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి- ఆహారం కావాలి. పెద్దలు, పిల్లలు తీసుకుంటున్న ఆహారం సరిపోతుందా లేదా! తెలుసుకోవాలంటే వాళ్ల పోషకాహార స్థాయి పరిశీలించాలి.
  4. బఫర్ నిల్వలు: భారత ఆహార కార్పొరేషన్(FCI) వారు ఆహారధాన్యాలు కొనుగోలు చేసి వాటి నిల్వలు మార్కెటు డిమాండ్‌లకు అనుగుణంగా నిర్వహణ చేస్తారు. ఆహార ధాన్యాల నిల్వలను బఫర్‌నిల్వలు అంటారు.
  5. ఆకలి: ఆహారం తీసుకోవాలనే కోరిక లేదా అవసరాన్ని ఆకలి అంటారు.
  6. ప్రజా పంపిణీ వ్యవస్థ: భారతదేశంలో ఆహార భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ‘‘ప్రజా పంపిణీ వ్యవస్థ’’ (PDS). పేద ప్రజలకు కావలసిన ఆహార పదార్థాలను ‘రేషన్ దుకాణం’ ద్వారా తక్కువ ధరలకు ప్రభుత్వం సమకూర్చుతుంది.
వ్యాస రూపక ప్రశ్నలు:
1) ప్రకృతి వైపరీత్యం వల్ల ఒక సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని అనుకుందాం. ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి?
  1. దేశం మొత్తానికి సరిపడా ఆహార ధాన్యాలు పండించడం అనేది మొదటి మెట్టు.
  2. తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి, కాలక్రమంలో పెరుగుతూ ఉండాలి.
  3. ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెంచడానికి దిగుమతులు ఒక మార్గం.
  4. ఆహార లభ్యత పెంచడానికి ప్రభుత్వం నుంచి బఫర్‌నిల్వలు ఉపయోగించుకోవ డం ముఖ్యమైన మార్గం.
  5. ప్రభుత్వం తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ప్రజలకు కావలసిన బియ్యం అమ్మడం ద్వారా దాని లభ్యతను పెంచవచ్చు.
  6. ప్రభుత్వ వద్ద నిల్వలు తగిపోయిన కానీ ఆ సంవత్సరం వినియోగానికి తగిన బియ్యం లభ్యత పెరుగుతుంది.
  7. ఆహార కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు కావలసిన ఆహార పదార్థాలను రేషన్ షాపుల ద్వారా సప్లయి చేస్తుంది.
  8. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ల ద్వారా ఆహార పదార్థాల సరఫరా చేస్తూ, ఆహార లభ్యతను ప్రభుత్వాలు పెంచుతూ, ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగిన ఆహార ఉత్పత్తి లోటును తీర్చుతాయి.

2. ఆహార ఉత్పత్తి పెరగడానికి ఆహార భద్రతకు మధ్య గల సంబంధాన్ని వివరించండి.

  1. ఆహార భద్రతకుసరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం ముఖ్యమైన అవసరం. దీని అర్థం అధిక మొత్తంలో ఆహార పదార్థాలను రైతులు పండించగల పరిస్థితులను భారతదేశ ప్రభుత్వం కల్పించాలి.
  2. గత కొద్ది దశాబ్దాలుగా సాగు కింద ఉన్న భూమి ఇంచుమించు స్థిరంగా ఉంది. కనుక, ఆహార ఉత్పత్తి పెరగడానికి దిగుబడులు ముఖ్యమవుతాయి.
  3. హెక్టారుకు లభించే పంట దిగుబడిని పెంచడానికి అవసరమైన ఉత్పాదకాలను సక్రమంగా వినియోగించుకోవాలి. సాగునీటిని పెంచాలి. నీరు అందరికీ అందేలా పంచుకొనే పద్ధతిలోనే వినియోగించాలి.
  4. తక్కువ దిగుబడి వున్న పంటలను వర్షాధార ప్రాంతాలలో సాగు చేయాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తటం, వర్షపు నీటిని నిల్వ చేయడం, పంటల మార్పిడి పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచాలి.
  5. దేశం మొత్తానికి సరిపడా ఆహార ధాన్యాలను పెంచాలి. అప్పుడే ఆహార భద్రత కలుగుతుంది. దీని అర్థం దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి, కాలక్రమంలో పెరుగుతూ ఉండాలి.
  6. ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెంచడానికి దిగుమతులు ఒకమార్గం. ప్రభుత్వం తన దగ్గర వున్న నిల్వలు సరఫరా చేసి ఆహార లభ్యత పెంచడం ద్వారా ఆహార భద్రతను కలిగిస్తుంది.
  7. కరువులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగి, ఆహార ఉత్పత్తి తగ్గితే, ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని రైతుల ప్రయోజనాలను కాపాడాలి.

సంక్షిప్త ప్రశ్నలు:
1. తప్పు వాక్యాలను సరి చేయండి.

  1. ఆహార భద్రత సాధించడానికి ఆహార ఉత్పత్తిని మాత్రమే పెంచితే సరిపోతుంది.
  2. ఆహార భద్రత సాధించడానికిఒకే పంటసాగును ప్రోత్సహించాలి.
  3. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలలో తక్కువ కాలరీల వినియోగం ఎక్కువగా ఉంటుంది.
  4. ఆహార భద్రత సాధించడంలో చట్ట సభల ప్రాధాన్యత ఎక్కువ.
  5. పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగించవచ్చు.

జ:

  1. ఆహార భద్రత సాధించడానికి ఆహార ఉత్పత్తి ఆహార లభ్యతఆహార సక్రమ పంపిణీ సమర్థవంతమైన ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా చౌకగా అందించుట మొదలైనవి కావాలి.
  2. ఆహార భద్రతకు బహుళ పంటల నమునా తప్పని సరి. పంట మార్పిడి చేయాలి.
  3. తక్కువ ఆదాయం వల్ల తక్కువ కాలరీల వినియోగం ఎక్కువగా ఉంటుంది. (అవును)
  4. ఆహార భద్రతను సాధించడంలో చట్ట సభల ప్రాధాన్యత ఎక్కువ. (అవును)
  5. పిల్లల్లో పోషకాహారం లోపాన్ని సరిచేయుటకు 'ప్రజా పంపిణీ వ్యవస్థ' ఉపయోగించవచ్చు. (అవును).

 

2. గ్రామీణ ప్రాంతాలలో కాలరీల వినియోగం గత కొద్ది కాలంగా_____(తగ్గింది).2004-05లో తలసరి సగటు కాలరీల వినియోగం అవసరమైన దానికంటే _______ (2400 తక్కువగా) ఉంది. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజుకు
కనీసం 2100 కాలరీలు అవసరం. పట్టణ ప్రాంతంలో 2004-05లో కాలరీల అవసరం _____ (2400) వినియోగం మధ్య అంత రం ________ (ఎక్కువ).

3. బరువు తక్కువగా ఉండడానికి, ఆహార అందుబాటుకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయడానికి మీ ప్రాంతం నుంచి ఒక ఊహాజనిత ఉదాహరణ ఇవ్వండి.

 

  1. జాతీయ పోషకాహార సంస్థ చేసిన సర్వే ప్రకారం దే శంలోని పలు రాష్ట్రాలలో 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న 7000 మంది పిల్లల్లో 45% మంది తక్కువ బరువు ఉన్నారు.
  2. ఈ పిల్లలు వాస్తవానికి సరిపడా ఆహారం దొరకక ఆకలితో ఉంటున్నారు.
  3. దాదాపు సగం మంది పిల్లలు ఎదుగుదల, సామర్థ్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. బరువు తక్కువ, ఆహార అందుబాటుకు మధ్య ప్రత్యక్ష సంబంధం కలదు.
  4. సరిపడా ఆహారం ఉంటే ఎవరూ ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కానీ, తక్కువ ఎత్తు కానీ ఉండరూ.

4. వారం రోజుల మీ కుటుంబ ఆహార అలవాట్లను విశ్లేషించండి. దాంట్లోని పోషకాలను వివరించడానికి ఒక పట్టిక తయారు చేయండి.

వారం ఆహార పదార్థం పోషకాలు
సోమ అన్నం, పప్పు, ఆకుకూరలు, పెరుగు కార్బొహైద్రెట్సు, ప్రోటీన్లు, శక్తి అందింస్తుంది.
మంగళ అన్నం, వంకాయ కూర, కోడి గుడ్లు, మజ్జిగ పిండి పదార్థం, ‘A’ విటమినన్లు, కణజాల పునఃరుద్ధరణ
బుధ అన్నం, బంగాళదుంపలు, రసం, పాలు, పెరుగు కార్బొహైడ్రెట్సు, శరీర ఎదుగుదలకు దోహదం
గురు అన్నం, క్యారెటు, పెరుగు కార్బొహైడ్రెట్సు, ‘A’ విటమినన్లు
శుక్ర అన్నం, పరమాన్నం(బెల్లం), కూరగాయలు, పప్పు కార్బొహైడ్రెట్సు, ఇనుప ధాతువు (ఖనిజ లవణం)
శని అన్నం, రాగి సంకటి, కూరగాయలు కార్బొహైడ్రెట్సు, విటమిన్లు
ఆది అన్నం, కోడి మాంసం కార్బొహైడ్రెట్సు,కొవ్వు (మాంసంకృత్తులు) శరీర ఎదుగుదలకు దోహదం

5. ‘‘ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదు’’. ఈ వ్యాఖ్యానానికి వాదనలు పేర్కొనండి.
  1. భారతదేశంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండడానికి ప్రజలకు చౌక ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. చౌక ధరల దుకాణాలు అందరికీ తక్కువ ధరలతో ఆహార ధాన్యాలు అందిస్తున్నాయి.
  3. 2013లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం అనే ఒక కొత్త చట్టం చేసింది. ఇది ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధత నిచ్చింది.
  4. ఈ చట్టం ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి.
  5. ఈ చట్టం ప్రకారం అవసరమైన గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా 75 శాతానికి, పట్టణ జనాభాలో 50 శాతానికి ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసే హక్కు ఉంది.
  6. ఈ చట్టం ప్రకారం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల్లు, అంగన్ వాడికి వచ్చే 1 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లు, బడికి వచ్చే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి.
  7. ఇటీవల కాలంలో ఆహార భద్రత అమలయ్యేలా చూడడంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది.

#Tags