2. శ్వాసక్రియ - శక్తి ఉత్పాదక వ్యవస్థ

Respiration (శ్వాసక్రియ) అనే పదం Respire(పీల్చడం) అనేలాటిన్ పదం నుండి ఏర్పడింది. ADPసంక్లిప్తరూపంినోసిన్ డై ఫాస్పేట్ సకశేరుకాల రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణంహీమోగ్లోబిన్ విడిచే గాలిలో CO2, ఉంటుందని తొలిసారిగా తెల్పినదిలేవోయిజర్ మానవుని ఊపిరితిత్తిలోని వాయుగోణుల వైశాల్యం 160 చ‌.మీ. ఉంటుంది. ECGపరీక్ష సంక్లిప్త రూపం లక్ట్రో కార్డియోగ్రాఫ్

క్విక్ రివ్యూ
శ్వాసక్రియ:- శరీరంలో ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెంది, శక్తిని విడుదల చేసే క్రియను ''శ్వాసక్రియ'' అంటారు. ఇది 2 రకాలు అవి:
1. అవాయు శ్వాసక్రియ: ఆక్సీజన్ ప్రమేయం లేకుండా కణాల్లో జరిగే క్రియ
2. వాయు శ్వాసక్రియ: ఆక్సీజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ. దీనిలో అధిక శక్తి వెలువడుతుంది.
శ్వాసక్రియ సమీకరణం:C6H12O6 + 602-------->6C02 + 6H2O + 686 k.cal
శ్వాస వ్వవస్థ భాగాలు: - మానవుని శ్వాసవ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు
  • నాసికా రంధ్రాలు
  • నాసికాకుహారాలు
  • అంతరనాసికా రంధ్రాలు
  • గ్రసని
  • స్వరపేటిక,
  • వాయునాళం
  • శ్వాసనాళాలు
  • శ్వాసనాళికలు
  • వాయుకోశ గోణులు.

ఉపజిహ్విక:- దీనిని కొండనాలుకగా వ్యవహరిస్తారు. ఆహార, వాయు మార్గాల కూడలిగా పేర్కొనే గ్రసని భాగంలోని కంఠబిలంపై ఉండే మూత వంటి నిర్మాణం. ఇది స్వరపేటికలోని ఆహారం వెళ్ళకుండా, ఆహార వాహికలోకి గాలి వెల్ళకుండా కవాటంగా పని చేస్తుంది.

వాయు గోణులు:- ఊపిరితిత్తిలో వేల కొలది వాయుకోశ గోణులు చిన్నవిగా అమరి ఉంటాయి. ఇవి సంచి లాంటి వాయు పూరిత నిర్మాణాలు. వాయుకోశ గోణుల గోడలలో అధిక సంఖ్యలో రక్తకేశనాళికలు ఉండడం వలన వాయు మార్పిడి జరుగుతుంది. అంటే ఆక్సీజన్ రక్తంలోకి, కార్బన్ డై ఆక్సైడ్ వాయుగోణులలోనికి ప్రవేశిస్తాయి.

స్వరపేటిక:- వీటిలో స్వరతంత్రులు ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటికి వచ్చేగాలికి స్వరతంత్రులు కంపిస్తాయి. తద్వారా మాట్లాడటం, పాటలు పాడటం చేయగులగుతున్నాము.

జీవుల్లో శ్వాసేంద్రియాలు:-
మొప్పలు: జలశ్వాసక్రియ, ఉదా॥చేపలు, పీతలు, రొయ్యలు.
చర్మం:-చర్మీయ శ్వాసక్రియ, ఉదా॥వానపాము, జలగ,
వాయునాళాలు:వాయునాళ శ్వాసక్రియ ఉదా॥కీటకాలు,
ఊపిరితిత్తులు:- పుపుస శ్వాసక్రియ, ఉదా॥క్షీరదాలు, పక్షులు.

నిర్మాణక్రియ: సరళ అకార్బనిక మూలకాలైన కార్బన్, హైడ్రోజన్, ఆక్సీజన్‌లను సంక్లిష్ట కార్బానికి పదార్థాలుగా మార్చగలిగే ప్రక్రియను నిర్మాణక్రియ అంటారు.
ఉదా॥కిరణజన్య సంయోగక్రియ.

విచ్ఛిన్న క్రియ: సంక్లిష్ట పదార్థములు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నమై శక్తిని సమకూర్చే క్రియను ''విచ్ఛిన్నక్రియ'' అంటారు. ఉదా॥శ్వాసక్రియ

ఆక్సీజన్ లోటు: అధిక శ్రమ చేసినపుడు కండరాలలో ఆక్సీజన్ శాతం తగ్గుతుంది. దీనిని 'ఆక్సీజన్ లోటు' అంటారు.

మైటోకాండ్రియా: నిజకేంద్రక జీవులలో కణశ్వాసక్రియ మైటో కాండ్రియాలో జరుగుతుంది. ఈ చర్యలో విడుదలైన శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుంది. అందువల్ల మైటో కాండ్రియాలను ''కణశక్త్యాగారాలు''Power houses of Energy అంటారు.

ఎనర్జీ కరెన్సీ:- గ్లూకోజ్ విచ్ఛిన్న చెందడం వల్ల విడుదలైన శక్తి ATP (అడినోసిన్ ట్రై ఫాస్పేట్)అనే పదార్థ రూపంలో నిల్వ ఉంటుంది. ఇది చిన్న మొత్తాల్లో ఉండే రసాయనిక శక్తి కావున ని ATP 'ఎనర్జీ కరెన్సీ' అంటారు. ఇది కణంలో అవసరమైన టోటికి రవాణా అవుతుంది. ప్రతి ATPలో 7,200 కాలరీల శక్తి నిల్వ ఉంటుంది.

కిణ్వనం: ఇది ఆక్సీజన్ లేనపుడు జరిగే అవాయు శ్వాసక్రియారకం. ఆక్సీజన్ లేనపుడు ఈస్టు కణాలు పైరువికామ్లాన్ని ఇధనాల్‌గా లేదా లాక్టిక్ ఆమ్లంగా మారుస్తాయి. ఈ చర్యను కిణ్వనం అంటారు. లాక్టిబేసిల్లస్ వంటి బ్యాక్టీరియాలు ఈ చర్యను జరుపుతాయి. ఇది పెరుగుతయారీకీ, ఇడ్లీ, దోశ పులియడానికి అవసరం, ఆల్కహాల్ తయారీ పరిశ్రమకు ముఖ్యం.

వాయుగత వేళ్ళు: చెరువులు, చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కలలో వేర్లు భూమి ఉపరితలం పైకి చొచ్చుకొని వస్తాయి. ఉపరితలంపై ఉన్న వేళ్ళ ద్వారా ఆక్సీజన్‌ను వ్యాపన పద్ధతిద్వారా పీల్చుకుంటాయి. వీటిని 'శ్వాసవేళ్ళు' అని కూడా అంటారు. ఉదా॥మాంగ్రూవ్ మొక్కలు (మడచెట్లు)

లెంటిసెల్స్: లెంటిసెల్స్ అనేవి మొక్కలోపలికి తెరుచుకొని ఉంటాయి. కణాలలో ఉండే వాయు పూరిత వల నిర్మాణంలో మొక్క అంతటా విస్తరించి ఉంటాయి. ఈ ఖాలీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలో మిగిలిన మొక్క భాగాలలో చిన్నవిగా ఉంటాయి. ఇందులో వాయువుల వినిమయం వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది.
ఉదా॥దారుయుత వృక్షాలు.

2. శ్వాసక్రియ - శక్తి ఉత్పాదక వ్యవస్థ



విషయ విశ్లేషణ:
శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని అందించడానికి పదార్థాలు ఆక్సీకరణం చెందించబడాలి. పదార్థాలు ఆక్సీకరణం చెందించబడే క్రియను''శ్వాసక్రియ'' అంటారు. ఇది కణాలలో జరుగుతుంది. కాబట్టి దీనిని ''కణశ్వాసక్రియ'' అంటారు.

శ్వాసక్రియ పాఠంలో ముఖ్యాంశాలు:
  1. శ్వాసక్రియ దశలు
  2. మానవునిలో శ్వాసక్రియా విధానం
  3. కణశ్వాసక్రియ
  4. వాయు సహిత, అవాయు శ్వాసక్రియలు
  5. మొక్కల్లో శ్వాసక్రియ
  6. కిరణజన్య సంయోగగ్రియ - శ్వాస క్రియ

'శ్వాసక్రియ' (Respiration) అనే పదం లాటిన్ పదం నుండి ఏర్పడింది. ఉచ్ఛాస నిశ్వాసాల ద్వారా ఆక్సీజన్ గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్ బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే కాకుండా ఆక్సీజన్ వినియోగింపబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది.

ప్రతి జీవిలోని కణాలన్నీ నిరంతరం శ్వాసక్రియను నిర్వహించాలి. జీవుల శరీర కణాలలో గ్లూకోజ్, ప్రొటీనులు, క్రొవ్వుపదార్థాలు ఆక్సీకరణం చెంది, CO2 నీరుగా మారి శక్తి విడుదల కావడమే 'శ్వాసక్రియ'

ఆహారం +ఆక్సీజన్ --------> కార్బన్ డై ఆక్సైడ్+ నీరు+శక్తి

శ్వాసక్రియలోని శక్తి వేడిరూపంలో ఉండటం వలన శరీరం 'వెచ్చగా' ఉంటుంది. మిగిలిన శక్తి ATP రూపంలో నిల్వ చేయబడుతుంది.

ADP+P4 (ఫాస్పేట్) +శక్తి ----> ATP

శ్వాసక్రియ రెండు రకములు:
1. వాయు సహిత శ్వాస క్రియ
2. అవాయుశ్వాస క్రియ

వాయుసహత శ్వాసక్రియ: ఆక్సీజన్ ఉన్నప్పుడు జరిగే శ్వాసక్రియ ఇది దీనిలో ఒక గ్లూకోజ్ అణువు నుండి 38 ATP అణువులు ఏర్పడును. ఈ వాయుసహిత చర్యలు ప్రధానంగా మైటోకాండ్రియాలో జరుగుతాయి.



అవాయు శ్వాసక్రియ: ఆక్సీజ్ లేనపుడు జరిగే శ్వాసక్రియ ఆక్సీజన్ లేనపుడు ఈస్ట్ కణాలు పైరూవికామ్లాన్ని ఇథనాల్/లాక్టిక్ ఆమ్లంగా మారుతస్తాయి. ఈ చర్యను 'కిణ్వనము' అని కూడా అంటారు. దీనిలో 2 ATP అణువులు ఏర్పడతాయి.



కండరాలలో అవాయు శ్వాసక్రియ జరిగి గ్లూకోజ్ పాక్షికంగా విడగొట్టబడి లాక్టిక్ ఆమ్లము ఏర్పడుతుంది.

కణశ్వాసక్రియ: శరీరంలోని జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా శక్తిని విడుదల చేసే క్రియను 'కణశ్వాసక్రియ' అంటారు.

మైండ్ మ్యాపింగ్

 

4 మార్కుల ప్రశ్న జవాబులు

  1. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియల మధ్య భాదాలను వ్రాయుము. (AS-1)
    కిరణజన్య సంయోగ క్రియ: శ్వాసక్రియ:
    1. ఆకు పచ్చని మొక్కలలో, పత్ర హరితం కలిగిన కొన్ని బ్యాక్టీరియాలలో జరుగుతుంది.

    1. ఇది అన్ని జీవులలో జరుగును.

    2. పగటిపూట మాత్రమే జరుగును.

    2. అన్ని వేళలలో జరుగును.

    3. కిరణజన్య సంయోగ క్రియ జరుపకుండా మొక్క కొద్ది రోజులే జీవించగలదు

    3. ఇది నిరంతర ప్రక్రియ. ఇది లేకుంటే జీవి కొద్ది నిమిషాలే జీవిస్తుంది.
    4. హరితరేణువుల్లో జరుగుతుంది. దీనికి సూర్యకాంతి అవసరం 4. మైటో కాండ్రియాలలో జరుగును. దీనికి సూర్యకాంతి అవసరం లేదు.
    5. కార్బన్ డై ఆక్సైడ్, ముడి పదార్థాలు 5. పిండి పదార్థాలు, కర్బన పదార్థాలు, ఆక్సీజన్, వినియోగపడతాయి.
    6. CO2 వినియోగం చెంది O2విడుదల అవుతుంది. 6. O2 వినియోగం చెంది CO2విడుదల అవుతుంది
    7. కాంతిశక్తిని ఉపయోగించి ATP ని ఉత్పత్తి చేస్తుంది. (క్రాంతి భాస్వీకరణము) 7. గ్లూకోజ్‌ను ఆక్సీకరణం చేసి ATP ని ఉత్పతి చేస్తుంది.(ఆక్సీడేటివ్‌ పాస్పారిలేషన్)
    8. నీటి అణువులోని H2 ను ఉపయోగించుకొనిNADPను NADH2 గా క్షయకరణం చేస్తుంది. 8. NADH2 అనేది పిండిపరదార్థాలలలోని హైడ్రోజన్ నుండి ఏర్పడుతుంది.
    9. ATP,NADH2లు కర్బన సమ్మేళనాల తయారీకి ఉపయోగపడతాయి. 9. ATP,NADH2 లు కణంలోని చర్యలకు ఉపయోగపడతాయి.
    10. ఇది నిర్మాణాత్మక చర్య (ఎనబాలిక్) 10. ఇది విచ్ఛిన్నక్రియ (కెటబాలిక్)

    11. పిండి పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి జీవి బరువు పెరుగుతుంది.

    11. ఇది శక్తిని విడుదల చేసే క్రియ. కాబట్టి జీవి బరువుని తగ్గిస్తుంది.

    12. ఇది ఉష్ణగ్రాహక చర్య

    12. ఇది ఉష్ణమొచక చర్య
  2. ప్ర: 'కణశక్త్యాగారం'గా పిలవబడే కణాంగం ఏది? దీనిని పట సహాయంతో - వివరింపుము (AS-5)
    జ: కణంలో శక్తిని ఉత్పిత్తి చేసే బాగం మైటో కాండ్రియా. దీనిని 'కణ శక్త్యాగారం'' (power houses of cell) గా పిలుస్తారు.
    1. మైటోకాండ్రియాలు పొడవుగా, దండాకారంలో ఉంటాయి.
    2. ఇది బాహ్య, అంతరత్వచాలను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో మాత్రిక ఉండును.
      మాత్రిక లోపలి త్వచం ముడుతలు పడి ఉంటుంది. వీటిని - క్రిస్టే అంటారు.
    3. ముడుతల మధ్య ఉండే త్వచం మైటోకాండ్రియా వెలుపలి భాగంతో కలిసి ఉంటుంది.
    4. మాత్రికలోనికి చొచ్చుకొని పై వరకు ఎక్కువ సంఖ్యలో ప్రాథమిక రేణువులు ఉంటాయి.
    5. శ్వాస3కియకు సంబంధించిన ఎంజైములు ప్రాథమిక రేణువులలో ఉంటాయి.
      -మైటోకాండ్రియాలో శక్తి ATP రూపంలో నిల్వ చేయబడే ఉండుట వల్ల వీటిని 'శక్తి ఉత్పాదక కేంద్రములు' అందురు.
  3. ప్ర:. శ్వాసక్రియలో జరిగే దశలను రేఖా చిత్రం ద్వారా వివరింపుము. (AS-1)
    జ: శ్వాసక్రియ అనేది అనేక జీవ, రసాయన, భౌతిక చర్యల సంక్లిష్ట ప్రతిరూపము. దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ క్రింది రేఖా చిత్రంలో - ఉఛ్వాస నిశ్వాసాలు, ఊపిరితిత్తులో వాటు మార్పిడి, రక్తం ద్వారా వాయురవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి మరియు కణ శ్వాసక్రియగా చూపించవచ్చు.

    1. ఊపిరితిత్తులలోనికి.O2 బయటికి CO2 ల వాయు సంచారం
    2. వాయుకోశ గోణులు, రక్తకేశ నాళికల మధ్య వాయు మార్పిడి జరుగుతుంది.
    3. వాయుగోణుల గోడలలో గల రక్తకేశనాళికలోని రక్తంలోకి ఆక్సీజన్, రక్తంలోని CO2 వాయు గోణిలోకి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది.
    4. ఆక్సీజన్ రక్తం నుండి కణజాలాలలోనికి, CO2 కణజాలాల నుండి రక్తంలోనికి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది.
    5. కణజాలాలు లేదా కణాలు O2 ను వినియోగించుకుని, గ్లూకోజ్‌ను దహించి, CO2నీరు, శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి జీవక్రియలకు వినియోగించబడుతుంది.
  4. ప్ర: మానవునిలో స్వాస వ్యవస్థ పటము గీచి, భాగాలను గుర్తించుము. (AS-5)
    జ:
  5. ప్ర: మానవ శరీరంలో జరిగే శ్వాసక్రియ యంత్రాగాన్ని నీవెలా అభినందిస్తావు? (AS-6)
    జ:
    1. మన శరీరంలో నిరంతరం జరిగే శ్వాసక్రియా యంత్రాంగంలో-నాసికా రంధ్రాలు, నాసికా కుహారం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు, రక్తం కలిసి సమన్వయంగా,చ‌క్కగా పనిచేస్తాయి.
    2. ఉరః కుహారాన్ని, ఉదరకుహారాన్ని వేరు చేస్తూ ఉదర వితానం అనే పొర ఊపిరితిత్తులలోకి గాలి రావడానికి, బయటికి పోవడానికి అవసరమైన కదలికకు సహకరిస్తుంది.
    3. స్త్రీలలో శ్వాస కదలికలకు ప్రత్యేకంగా పక్కటెముకలు తోడ్పడతాయి.
    4. గ్రసని అనేది ఆహా, వాయు మార్గాల కూడలి. దీనిలో కొండ నాలుక ముఖ్యమైనది. ఇది సంబంధిత మార్గాలలోనే గాలి, ఆహారం సక్రమంగా వెళ్లేలా చేస్తుంది. కొండ నాలుక విధి చాలా గొప్పది
    5. ఊపిరి తిత్తులలోపల వేల సంఖ్యలోవాయుకోశ గోణులు అమరి ఊపిరితిత్తుల వైశాల్యాన్ని పెంచి, సులభంగా వాయు మార్పిడికి తోడ్పడతాయి.
    6. మన శరీరంలోనిరంతరం జరిగే శ్వాసక్రియ వల్ల కణాలు ఎల్లప్పుడు శక్తిని పొందతూ, శరీరం స్థిర ఉష్ణోగ్రత (37 సెంటీగ్రేడ్) కలిగి వెచ్చగా ఉండటం అనేది శ్వాసక్రియ విధానం యొక్క గొప్పదనంగానే భావించాలి.
  6. ప్ర: శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుందని ఎలా నిరూపిస్తావు? (AS-5)

    ఉద్దేశ్యము:- శ్వాసక్రియలో ఉష్టం విడుదలగునని నిరూపించుట
    పరికరములు:- 2 బీకర్లు, 2 థర్మాస్ ప్లాస్కులు, 2 థర్మామీటర్లు , బఠానీ లేదా చిక్కుడు గింజలు.

    ప్రయోగ విధానం:
    1. ప్రయోగానికి ఒకరోజు ముందు రెండు బీకర్లలో - సగం వరకు బఠానీ గాని, చిక్కుడు గింజలతో గాని నింపాలి. ఏదైనా ఒక బీకరులో మాత్రమే నీరు పోసి ఒక రాత్రి నానబెట్టాలి.
    2. మరుసటిరోజున గట్టి బిరడాలు గల 2 థర్మాస్ ప్లాస్కులు తీసుకోవాలి.
    3. నానబెట్టిన విత్తినాలను ఒక ప్లాస్క్‌లో, పొడిగా ఉన్న విత్తనాలను రెండవ ప్లాస్క్‌లో ఉంచవలెను.
    4. కార్కులకు రంధ్రములు చేసి దాని ద్వారా థర్మా మీటర్లు ఉంచవలెను. థర్మా మీటర్లు ప్లాస్కులో విత్తనాల మధ్య ఉండేటట్లు చూడాలి.
    5. ప్రతి 2-3 గంటలకు ఒకసారి రెండు సార్లు ప్లాస్కుల్లోని ఉష్ణోగ్రతలను చూసి 24 గంటల వరకు నమోదు చేయవలెను.

    పరిశీలన: మొలకెత్తుతున్న ప్లాస్కులోని ఉష్ణోగ్రత, పొడి విత్తనాలు గల ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండటం గమనిస్తాము.

    నిర్థారణ: ఈ ప్రయోగం వల్ల మొలకెత్తుతున్న విత్తనాల నుండి ఉష్ణము విడుదలవుతుందని తెలుస్తున్నది.
     
  7. ప్ర: ఊపిరితిత్తులకు సంభవించే శ్వాసకోశ వ్యాధుల గురించి తెలుసుకోవడానికి శ్వాసకోశ వ్యాధి నిపుముడిని కలిసి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? (AS-2)
    జ: నేను ఊపిరితిత్తులకు వచ్చే వాధ్యు సమాచారం కొరకు ఆ వ్యాధి నిపుణుడిని కలిసినపుడు ఈ క్రింది ప్రశ్నలు అడుగుతాను.
    1. విశ్రాంతి దశలో ఉన్నప్పుడు సాధారణంగా శ్వాసక్రియ రేటు ఎంత ఉండాలి?
    2. ఊపిరితిత్తులకు నష్టం కలిగించే కారకాలు లేదా వాయువులు ఏవి?
    3. సాధారణంగా ఊపిరితిత్తులకు ఎలాంటి వ్యాధులు వస్తాయి?
    4. ఆసుపత్రులలో వాడే వెంటిలేటర్లు అనగానేమి? అవి రోగికి ఎపుడు అవసరం?
    5. శ్వాసక్రియ సక్రమంగా ఉందా, లేదా అని తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్ష చేస్తారు?
    6. సిగరేట్, గుట్కా, పాన్ నమలడం వల్ల లాభమా? నష్టమా? దాని ప్రభావం ఎలా ఉంటుంది.?
  8. ప్ర: దహనం, శ్వాసక్రియ దాదాపు ఒకే రకమైన చర్యలు అనవచ్చా? దీనికి నీవిచ్చే ఆధారాలు ఏమిటి? (AS-5)
    జ: దహనం, శ్వాసక్రియ చర్యలు దాదాపు ఒకే రకంగా కనిపించినా వీటిలో కొద్ది పాటి పోలికలు ఉంటాయి. చక్కెర ణువులను మండించడము ఉదాహరణగా తీసుకుంటే దీనిలో CO2, నీరుతో పాటు వేడి ఉత్పత్తి కావడం దహన చర్యలో భాగము, ఈ చర్యకు ఆక్సీజన్ అవసరం. అలాగే శ్వాసక్రియలో జరిగే చర్య కూడా ఇదే రకంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండు చర్యలతో కొద్దిపాటి తేడాలు కన్పిస్తాయి.

    దహనచర్యలో చక్కెర అణువులు మండడానికి మంట ద్వారా వేడి అందిస్తాము. జీవి శరీరంలో చక్కెర అణువులు ఆక్సీకరణకు మామూలు ఉష్ణోగ్రత చాలు. దహన చర్యలో చక్కెర నల్లగా మారుతుంది. కాని శరీరంలో జరిగే శ్వాసక్రియ వివిధ దశలలో జరుగుతుంది. దహన చర్యలో శక్తి వేడిమి రూపంలో విడుదల అవుతుంది. శ్వాసక్రియలో మధ్యస్థ పదార్థాలు ఉత్పిత్తి అవుతాయి. దహన చర్య నీరు లేనపుడు జరుగుతుంది. శ్వాసక్రియ మాత్రము నీరు ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. చక్కెర మండినపుడు శక్తి వేడి రూపంలో ఒక్కసారిగా పరిసరాల్లోకి చేరుతుంది. శ్వాసక్రియలో శక్తి కొద్దికొద్దిగా, వివిధ దశలలో విడుదలవుతుంది. దీనిలో కొంత భాగం రసాయనిక శక్తిగా,మిగిలినది వేడి రూపంగా మారుతుంది. దీని వల్ల జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది. కాబట్టి ''శ్వాసక్రియ అనేది ఒక రకమైన దహనక్రియ' గా రాబిన్‌సన్ వర్ణించాడు. ఈ రెండింటిని పూర్తిగా ఒకే రకమైన చర్యలుగా గుర్తించలేము.

 

2 మార్కులు ప్రశ్న జవాబులు

 

 

  1. శ్వాసక్రియ అనగా నేమి? దీనిక తగిన సమీకరణం సూచించండి? (AS-1)
    జ: శరీరంలో ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెంది, శక్తిని విడుదల చేసే క్రియను ''శ్వాసక్రియ'' అంటారు.
    సమీకరణం:
    C6H12O6 + 60 2 ---------> 6C02 + 6H2O + 686 k.cal
     
  2. శ్వాసక్రియలోని దశలు పేర్కొనుము. (AS-1)
    జ: శ్వాసక్రియను 2 రకాలుగా విభజిస్తారు. అవి
    1. బాహ్య శ్వాస క్రియ
    2. అంతర శ్వాసక్రియ.

    బాహ్య శ్వాస క్రియలో ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అనే దశలు ఉంటాయి. అంతర శ్వాసక్రియలో గ్లైకాలిసిస్, క్రెబ్స్ వలయం లేదా కిణ్వనం అనే దశలు ఉంటాయి.
     
  3. మానవుని శ్వాస వ్యవస్థలో పాల్గొనే వివిధ భాగాల వరుస క్రమం రాయండి.
    జ: మానవుని శ్వాస వ్యవస్థలో పాల్గొనే భాగాల క్రమము ఇలా ఉంటుంది. అవి:
    1. నాసికా రంధ్రాలు
    2. నాసికా కుహారాలు
    3. అంతర నాసికా రంధ్రాలు
    4. గ్రసని
    5. స్వర పేటిక
    6. వాయునాళం
    7. శ్వాస నాళాలు
    8. శ్వాసనాళికలు
    9 వాయుకోశ గోణులు
     
  4. ప్ర: వాయు సహిత, అవాయు శ్వాసక్రియల మధ్య తేడాలు వ్రాయుము. (AS-1)
    జ:
    వాయు సహిత అవాయు శ్వాసక్రియ
    1. ఆక్సీజన్ అవసరం ఉంటుంది. 1. ఆక్సీజన్ అవసరం ఉండదు. చర్య మాత్రం జరుగుతుంది.
    2. దీనిలో CO2నీరు ఏర్పడతాయి. 2. CO2, ఇధనాల్ తేదా లాక్టిక్ ఆమ్లం ఏర్పడతాయి.
    3. ఎక్కువ శక్తి (686 k.cal)ఉత్పన్నం అవుతుంది. 3. తక్కువ శక్తి (56 k.cal) ఉత్పన్నం అవుతుంది.
    4. గ్లైకాలిసిస్, తర్వాత క్రెబ్స్ వలయం జరుగుతుంది. 4. దీనిలో గ్లైకాలిసిస్ తర్వాత కిణ్వి ప్రక్రియలు జరుగుతాయి.
  5. ప్ర: నిత్యజీవితంలో కిణ్వనం యొక్క ఉపయోగము వ్రాయుము? (AS-6)
    1. కిణ్వన ప్రక్రియను ఏక్కువగా ఆల్కహాల్ తయారీ పరిశ్రమలలో వాడతారు.
    2. ఈస్టు కణాలను ఉపయోగించి రొట్టెల తయారీలో, ఆల్కహాల్ ఉత్పత్తిలో వాడతారు.
    3. వైన్, బీరు తయారీలో కిణ్వన ప్రక్రియ ముఖ్యమైనవి.
    4. ఇడ్లీ, దోశ వంటి ఆహార పదార్థాలు తయారీకి ఇదే ప్రక్రియ
    5. ఎసిటిక్ ఆమ్లము తయారీలోనూ కిణ్వనం పద్ధతి అవసరము.
  6. వివిధ జీవులలో శ్వాసేంద్రియాలు, శ్వాసక్రియా రకాలు తెల్పుము? (AS-1)
    జ:
    క్ర.సం శ్వాసేంద్రియం శ్వాసవ్యవస్థ ఉదాహరణ
    1. మొప్పలు జలశ్వాస క్రియ చేపలు, పీతలు, టాడ్‌పోల్
    2. చర్మం చర్మీయశ్వాసక్రియా వానపాము, జలగ, కొన్ని ఉభయ జీవులు
    3. వాయునాళాలు వాయునాళశ్వాసక్రియ కీటకాలు
    4. ఊపిరితిత్తులు పుపుస శ్వాసక్రియ క్షీరదాలు, పక్షులు సరీసృపాలు, కొన్ని ఉభయ జీవులు.
  7. ప్ర: రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే శ్వాసక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.? (AS- 1)
    జ: 1. సాధారణంగా ఆరోగ్యవంతుని రక్తంలో హిమోగ్లోబిన్ సాతం 12-18 g/dl.ఉంటుంది. ఈ మోతాజు కన్నా తక్కువైతే 'ఎనీమియా' గా గుర్తించవచ్చు.
    2. హీమోగ్లోబిన్ స్థాయి తగ్గితే శరీర జీవక్రియలకు సరిపడా ఆక్సీజన్ లభించదు. దీని వల్ల శ్వాసక్రియా రేటు పెరుగుతుంది.
    3. ఫలితంగా వ్యక్తి శక్తి లేకుండా, బరువు తగ్గడం, అలసట, నీరసంగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.
     
  8. ప్ర: మైటోకాండ్రియాను 'కణ శక్త్యాగారం' అని ఎందుకు అనవచ్చో తెల్పండి. (AS - 1)
    జ: నిజకేంద్రక జీవులలలో శ్వాసక్రియ కొంతభాగం కణ ద్రవ్యంలోనూ, ఎక్కువ భాగం కణంలోని మైటో కాండ్రియాలో జరుగుతుంది. ఈ చర్యలో విడుదలైన శక్తి ATP రూపంలో నిల్వ చేయబడుతుంది. ఇది జీవుల అనిన చర్యలకు ఉపయోగపడుతుంది. అందువల్ల మైటో కాండ్రియాను 'కణ శక్త్యాగారము' అంటారు.
     
  9. ప్ర: 'ఎనర్జీ కరెన్సీ' అనగా నేమి? దాని శక్తి విలువ ఎంత? (AS - 1)
    జ: గ్లూకోజ్ విచ్చిన్న చెందడం వల్ల విడుదలైన శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుంది. దీనినే కణం యొక్క 'ఎనర్జీ కరెన్సీ' అంటారు. ఇలా నిల్వవున్న శక్తి కణంలో అవసరమైన చోటుకు రవాణా అవుతుంది. ప్రతి ATPలో 7200 కేలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్పేట్ అణువులుగా బంధించబడి ఉంటుంది. ఈ బంధాలు విడిపోయినపుడు శక్తి విడుదల అవుతుంది.
     
  10. మొక్కలు పగటివేళ కిరణజన్య సంయోగక్రియను, రాత్రి శ్వాసక్రియను జరుపుకుంటాయని అంగీకరిస్తారా? లేదా? పరికల్పన చేయండి. (AS-2)
    జ: 1. మొక్కలు పగటి వేళల్లో కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడం సహజం. కాని శ్వాసక్రియను కేవలం రాత్రి వేళల్లోనే జరుపుకుంటాయనడం అంగీకరించను.
    2. పగటి పూట కాంతి లభించుట వల్ల మొక్కలో శ్వాసక్రియ కంటే కిరణజన్య సంయోగ క్రియా రేటు ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళల్లో దానికి వ్యతిరేకంగా ఉంటుంది.
    3.శ్వాసక్రియ అన్ని జీవులలో నిరంతరం జరిగే ప్రక్రియ. పైగా శక్తిని విడుదల చేసే ప్రక్రియ. కాబట్టి మొక్కలు పగలు, రాత్రి శ్వాసిస్తాయి.
     
  11. ప్ర: శ్వాసించడం, మరియు ఆహారం మింగడంలో ఉపజిహ్విక పాత్రను వర్ణించండి? (AS- 1)
    జ: గ్రసనిలో కంఠబిలంపై ఉండే మూత వంటి నిర్మాణాన్ని 'ఉపజిహ్విక' లేదా 'కొండనాలుక' అంటారు. ఇది స్వరపేటికలోనికి ఆహారం వెళ్ళకుండా, ఆహార వాహికలోకి గాలి వెళ్ళకుండా నిరోధిస్తుంది. అంటే ఉపజిహ్విక ఆహారం, వాయు కదలికలను క్రమబద్దీకరిస్తుంది. ఇలా ఉపజిహ్విక సక్రమంగా పనిచేస్తూ వాయు, ఆహారమార్గాల ద్వారా గాలి, ఆహారం వెళ్ళాలంటే, నాడీ నియంత్రణ చాలా అవసరం.
     
  12. ప్ర: ATP లో నిల్వ చేయబడిన అదనపు శక్తిని నీవెలాఅభినందిస్తావు? (AS-6)
    జ: గ్లూకోజ్ ఆక్సీకరణం చెంది విడుదలైన శక్తి వాటి జీవక్రియలకు అవసరం మిగిలిన అదనపుశక్తి ATPరూపంలో నిల్వచేయబడుతుంది. కణానికి శక్తి నివ్వాలంటే నిరంతరం ATPఅవసరం. ATPలో మూడు ఫాస్పేట్ అణువులు ఉంటాయి. అదనపు శక్తి దాదాపు చివరి ఫాస్పేట్ బంధంలో నిల్వచేయబడి ఉంటుంది. శక్తి అవసరమైనపుడల్లా ATPలోని చివరి ఫాస్పేట్ బంధం విడిపోతుంది. దీని నుండి వెలువడే శక్తి చర్య జరుపడానికి, ఇతర పనులకు ఉపయోగపడుతుంది.
     
  13. ప్ర: మొక్కలు ఆకులతో పాటు కాండంతోనూ శ్వాసిస్తాయని తగిన ఆధారాన్ని చూపించండి. (AS-1)
    జ: సహజంగా మొక్కలు ఆకులతోను, మరికొన్ని కాండంతోను శ్వాసిస్తాయి. వాయు వినిమయం (O2-CO2) కోసం పత్రాలు పత్ర రంధ్రాలను కలిగి ఉంటే, కొన్ని మొక్కల కాండాలు లెంటిసెల్స్ అనే నిర్మాణాలు కలిగి ఉంటాయి. లెంటిసెల్స్ కాండం బాహ్య కణజాలంతో సంబంధం కలిగి ఉంటాయి.
     
  14. ప్ర: ఎత్తై ప్రదేశాల్లో నెమ్మదిగా నడిచినప్పటికీ శ్వాసక్రియ వేగంగా జరగాడినికి కారణం ఏమిటి? (AS-1)
    జ: కొండలు, గుట్టలు వంటి ఎత్తైన‌ ప్రదేశాల్లోని గాలిలో ఆక్సీజన్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి సరిపడ ఆక్సీజన్ కోసం ఎక్కువ సార్లు శ్వాసించవలసి ఉంటుంది. అందువలన శ్వాసక్రియ రేటు పెరుగుతుంది.
     
  15. ప్ర: మన పెద్దలు/మిత్రులు భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదని సలహాలు ఇస్తుంటారు. ఎందుకు? (AS-1)
    జ: మనం ఆహారం తినేటపుడు ఆహారం పొరపాటున స్వరపేటికలోకి వెళ్ళకుండా కొండనాలుక అడ్డుకుంటుంది. కాని ఒక్కోసారి మాట్లాడుతూ ఆహారం తినడం వల్ల కొండనాలుకకు సంబంధించిన నాడీ పనిచేయకపోవడం వల్ల ఆహారపదార్థాలు వాయునాళంలోకి వెల్తాయి. తిరిగి నాసికా రంధ్రాల ద్వారా బయట పడతాయి. ఈ ఇబ్బంది కలగకుండా భోజనం చేయునపుడు మాట్లాకుండా, ప్రశాంతంగా భుజించవలెను.

 

 

1 మార్కు ప్రశ్న జవాబులు

 

  1. కణ శ్వాసక్రియ అంటే ఏమిటి? ఇది ఎక్కడ జరుగుతుంది?
    జ: శరీరంలోని జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహారపదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా శక్తి విడుదల చేసే రసాయన చర్యల సమాహారాన్ని ''కణశ్వాసక్రియ'' అంటారు.
     
  2. శ్వాసక్రియను ప్రభావితం చేసే కారకాలు ఏవి?
    జ: 1. ఆక్సీజన్ లభ్యత
    2. ఉష్ణోగ్రత
    3. ఎంజైముల క్రియా శీలత
    4. ఆక్సీకరణం చెందే పదార్థ స్వభావం
     
  3. గ్లైకాలిసిన్ అనగానేమి?
    జ: గ్లూకోజ్ అణువు ఆక్సీకరణలో మొదటి దశను ''గ్లైకాలిసిన్'' అంటారు. దీనిలో గ్లూకోజు రెండు పైరువికామ్ల అణువులుగా మారుతుంది.
     
  4. వాయునాళ శ్వాస3కియ జరుపుకునే జీవులేవి?
    జ: ఆర్థ్రోపొడ వర్గానికి చెందిన కీటకాలు వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసిస్తాయి. ఉదా॥బొద్దింక, మిడత
     
  5. అవాయు శ్వాసక్రియలో అంత్య ఉత్పన్నాలు ఏవి?
    జ: లాక్టిక్ ఆమ్లం లేదా ఇధనాల్, CO2 మరియు శక్తి విడుదలవుతాయి.
     
  6. రక్తంలో వాయురవాణాకు తోడ్పడే పదార్థం ఏది? దాని విధి తెల్పండి.
    జ: హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్థం. ఇది రక్తంలో O2,CO2 లను రవాణా చెందిస్తుంది. ఇది O2తో కలిసినపుడు, 'ఆక్సీహీమోగ్లోబిన్' ను CO2 తో కలిసినపుడు కార్బాక్సీ హీబోగ్లోబిన్‌ను ఏర్పరుస్తుంది.
     
  7. ఊపిరితిత్తులలో నిర్మాణాత్మ ప్రమాణాలుగా వేటిని పేర్కొంటారు?
    జ: వాయుకోశ గోణులు లేదా వాయు గోణులు. ఇవి ఊపిరితిత్తులలో అసంఖ్యాకంగా ఏర్పడి 'వాయు వినిమయము' నకు తోడ్పడుతాయి.
     
  8. శ్వాసక్రియ నిరంతర ప్రక్రియ అని చెప్పడానికి ఒక భౌతిక అనుభవం తెల్పండి.
    జ: ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందుతూ, శరీరం వెచ్చగా ఉండటం.
     
  9. ప్ర: ఉదర వితానం, ప్రక్కటెముకలు ఎవరి శ్వాసక్రియలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి?
    జ: ఉదర వితానం, ప్రక్కటెముకల కదలికల వల్ల ఉరః కుహారం పెరిగినపుపడు గాలి ఊపిరితిత్తులలలోకి వెళ్ళడం, ఉరః కుహారం తగ్గినప్పుడు ఊపిరితిత్తుల నుండి గాలి బయటికి వెళ్తుంది. ఇలా ఉదరవితానం పురుషులలో ప్రక్కటెముకలు స్త్రీలలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
     
  10. లెంటి సెల్స్ అనగా నేమి?
    జ: మొక్కలోని కాండం మీద పత్రరంధ్రాలను 'లెంటిసెల్స్' అంటారు. ఇవి వాయు వినిమయానికి తోడ్పడతాయి.
     
  11. అధిక శారీరక శ్రమ వల్ల కండరాలు ఎందుకు నొప్పిపెడతాయి?
    జ: అధిక శారీరక శ్రమ సమయంలో ఆక్సీజన్ లభ్యత తక్కువ కండరాలు అవాయుశ్వాసక్రియను పాటిస్తాయి. అందువలన కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి నొప్పి కలుగుతుంది.
     
  12. బేకరీలలో రొట్టెల తయారీదారులు పిండికి ఈస్టు కలిపినపుడు ఏం జరుగుతుంది?
    జ: బేకరీలలో రొట్టెల తయారీదారులు పిండికి, ఈస్టు కలిపినపుడు పిండిలో అవాయు శ్వాసక్రియ మొదలవుతుంది. పిండి పదార్థం ఆల్కహాల్‌గా మారుతూ CO2వెలువడుతుంది. ఫలితంగా పిండి పరిమాణం పెరుగుతుంది. ఆల్కహాలు వల్ల పిండి పులిసిన వాసన వస్తుంది.

    (2 మార్కుల ప్రశ్న క్రింద కూడా పరిగణించాలి.)
     
  13. ఎక్కువ దూరం నడవాల్సి వస్తే త్వరగా అలసిపోకుండా ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా?
    జ: ఎక్కువ దూరం పరుగెత్తాలన్నా, నడవాలన్నా నిరంతరం శ్వాసించడం వలన కొంత లాక్టిక్ ఆమలం తొలగించబడుతుంది. అందువల్ల ఎక్కువ సమయం అలసిపోకుండా ఉండగలము.
     
  14. ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనగా నేమి?
    జ: ఆక్సీజన్ సమక్షంలో ADP, ఫాస్పేట్ అణువుతో కలిసి ...గా మారుటను 'ఆక్సిడేటివ్ పాస్పారిలేషన్' అంటారు.
     

బహుళైచ్ఛిక ప్రశ్న జవాబులు (1/2 మార్కు)

 
  1. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం ( )
    ఎ. కేంద్రకం
    బి. మైటోకాండ్రియా
    సి. కణకవచం
    డి. రైబోసోములు
     
  2. విడిచే గాలిలో ఉండేఅంశాలు ( )
    ఎ.CO2, O2
    బి.CO2,నీటిఆవిరి
    సి. O2,నీటిఆవిరి
    డి. నీటిఆవిరి
     
  3. స్వరతంత్రులు ఈ క్రింది వాటిలో గమనించవచ్చు( )
    ఎ.గ్రసని
    బి. వాయునాళం
    సి.స్వరపేటిక
    డి. నాసికా కుహారం.
     
  4. కణశ్వాసక్రియ జరిగే స్థలం. ( )
    ఎ. కణద్రవ్యం
    బి.కేంద్రకం
    సి.హరితరేణువులు
    డి.మైటోకాండ్రియా
     
  5. మానవ శరీర ధర్మశ్రాస్త్ర గ్రంథ ర‌చ‌యిత‌ ( )
    ఎ. ప్రిస్ట్లే
    బి. లేవోయిజర్
    సి.హేవిండిష్
    డి.జాన్‌డాపర్
     
  6. ఒక ATPలో నిల్వ ఉండే శక్తి ( )
    ఎ.7200 కెలరీలు
    బి. 7200 కిలో కేలరీలు
    సి.7500 కేలరీలు
    డి.7500 కి.కేలరీలు
     
  7. గ్లూక్లోజ్ పైరూవిక్ ఆమ్లంగా ఏర్పడునప్పుడు పొందే నికరలాభం ( )
    ఎ. 2ATPఅణువులు
    బి. 36 ATPఅణువులు
    సి.38 ATPఅణువులు
     
  8. గరిష్ట శ్వాసక్రియా రేటు జరిగే ఉష్ణోగ్రత ( )
    ఎ.Oc
    బి.45C
    సి.60C
    డి.100C
     
  9. వాయునాళ వ్యవస్థ ఏ జీవులలో ఉంటుంది? ( )
    ఎ. కీటకాలు
    బి. కప్పలు
    సి. నత్తలు
    డి. సరీసృపాలు
     
  10. పురుషుల శ్వాసకదలికలలో ప్రధాన పాత్ర పోషించేవి. ( )
    ఎ. ఉదర వితానం
    బి. ప్రక్కటెముకలు
    సి. ఉరఃకుహారం
    డి.ఊపిరితిత్తులు
     
  11. శ్వాసక్రియ అనునది
    ఎ. అనబాలిక్ చర్య
    బి. కెటబాలిక్ చర్య
    సి. ఎ,బి
    డి.ఏదీకాదు.
     
  12. ఈ క్రింది వానిలో ఉభయచరజీవి ( )
    ఎ. వానపాము.
    బి.బొద్దింక
    సి.సాలమండర్
    డి.పాము
     
  13. ఉభయచర జీవులలో శ్వాసక్రియా విధానము ( )
    ఎ. చర్మశ్వాసక్రియ
    బి.పుపుసశ్వాసక్రియ
    సి. జలశ్వాసక్రియ
    డి. ఎ, బి
     
  14. జలశ్వాసక్రియలో ప్రధానమైన శ్వాసేంద్రియాలు ( )
    ఎ. చర్మం
    బి.మొప్పలు.
    సి.వాజములు
    డి. వాయునాళాలు
     
  15. ఊపిరితిత్తుల రక్షణపొరను 'ప్లూరా' అంటారు. గుండెపై గల రక్షణ పొరను ఇలా అంటారు. ( )
    ఎ.పెరికార్డియం
    బి.ఎపికార్డియం
    సి.అప్పర్‌కార్డియం
    డి. ఏదీకాదు.
     
  16. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? ( )
    ఎ. 5400 మి.లీ
    బి. 5800 మి.లీ
    సి. 4200 మి.లీ.
    డి.6000 మి.లీ
     
జవాబులు:
1) బి; 2)బి; 3)సి; 4)డి; 5)డి; 6)ఎ; 7)సి; 8)బి; 9)ఎ; 10)ఎ; 11)బి; 12)సి; 13)డి; 14)బి; 15)ఎ; 16)బి.

ఖాళీలు:-

 
  1. కణాలలో ఉన్న శక్తి ప్రమామాన్ని ................... అంటారు
  2. కేంద్రక పూర్వ కణాలలో శ్వాసక్రియ .....................లో జరుగుతుంది
  3. సాధారణ వాతావరణంలో ఆక్సీజన్ పరిమాణం .....................
  4. మాంగ్రూవ్(మడచెట్లు)లలో శ్వాసక్రియ .....................ద్వారా జరుగుతుంది.
  5. గ్లూకోజ్ ఆక్సీకరణలో మొదటి చర్యను .....................అంటారు.
  6. ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను.....................శ్వాసక్రియ అంటారు.
  7. కిరణజన్య సంయోగక్రియను నిర్మాణక్రియ అయితే శ్వాసక్రియను.....................అంటారు.
  8. శ్వాసక్రియను దహనక్రియాగా వర్ణించిన శాస్త్రవేత్త .....................
  9. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు.....................
  10. అమీబాలో శ్వాసక్రియ.....................ద్వారా జరుగును.
  11. కంఠబిలంపై మూత వంటి నిర్మాణం .....................
  12. ......................ద్వారా మొక్క కాండాలలో వాయు వినిమయం జరుగును.
  13. సున్నపు తేటను పాలవలె తెల్లగా మార్చే వాయువు......................
  14. మనం మాట్లాడటం, పాటలు పాడటం వంటివి .....................కంపనాల ఆధారంగా చేయగులుగుతాము.
  15. చక్కెర అనేది ఈస్టు ద్రావమం నుండి .....................అనే ప్రక్రియ ద్వారా ఇథనాన్ ను వేరుచేయవచ్చు.
  16. హీమోగ్లోబిన్ వర్ణదం మధ్యలో .....................అణువు ఉంటుంది.
  17. మాంగ్రూవ్ మొక్కలో శ్వాసక్రియ ప్రత్యేక నిర్మాణాలు .....................
  18. ఫలాలు శీతల ప్రదేశంలో ఉంచినపుడు.....................రేటు తగ్గుతుంది.
  19. మానవుడు శ్వాసక్రియలో భాగంగా ఉచ్చ్వసించే సమయంలో ఆక్సీజన్ శాతం.....
  20. నిశ్వసించే సమయంలో కార్బన్‌డై ఆక్సైడ్ శాతం........

జవాబులు:
1)ATP; 2)కణద్రవ్యం; 3)21శాతం; 4)శ్వాసవేళ్ళ; 5)గ్లైకాలిసిస్;
6)పుపుస; 7)విచ్ఛిన్నక్రియ; 8)రాబిన్‌సన్; 9) వాయుగోణులు; 10) శ‌రీర కుడ్యం ;
11)ఉపజిహ్విక; 12)లెంటిసెల్స్; 13)CO2; 14)స్వరతంత్రుల; 15)అంశికస్వేదనం ;
16)Fe; 17)శ్వాసవేళ్ళు ;18)శ్వాసక్రియ ;19) 21%; 20) 0.04%.

జతపరుచుము:

గ్రూప్-ఎ

  గ్రూప్-బి

 

1. ఎనర్జీ కరెన్సీ

( )

ఎ. కిరణజన్య సంయోగక్రియ

2. కణశక్త్యాగారము

( )

బి. శ్వాసక్రియ

3. కిణ్వనము

( )

సి. లాక్టిక్ ఆమ్లము

4. నిర్మాణక్రియ

( )

డి. మైటోకాండ్రియా

5. విచ్ఛిన్నక్రియ

( )

ఇ. ATP

 

 

ఎఫ్. పులియుట


జవాబులు:
1)డి; 2)ఎ; 3)బి; 4)ఇ; 5)సి.
 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

1. ఉపజిహ్విక

( )

ఎ. వాయు వినిమయం

 2. స్వరపేటిక

( )

బి. పురుషుల్లో శ్వాస కదలిక

 3. ఉదరవితానం

( )

సి. ఆహార,శ్వాస మార్గాల

 4. ప్రక్కటెముకలు

( )

డి. స్త్రీ శ్వాస కదలిక భాగం

 5. వాయుగోణులు

( )

ఇ. స్వరతంత్రులు

 

 

ఎఫ్. కణశ్వాసక్రియ


జవాబులు:
1)సి; 2)ఇ; 3)బి; 4)డి; 5)ఎ.
 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

1. విసరణం

( )

ఎ. మాంగ్రూవ్ మొక్కలు

2. లెంటిసెల్స్

( )

బి. కాండము

3. పత్రరంధ్రాలు

( )

సి. అమీబా

4. కండరాలు

( )

డి. పత్రము

5. శ్వాసవేళ్ళు

( )

ఇ.లాక్టిక్ ఆమ్లము

 

 

ఎఫ్. ఊపిరితిత్తులు



జవాబులు:
1)సి; 2)బి; 3)డి; 4)ఇ; 5)ఎ.
 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

1. సీతాకోక చిలుక

( )

ఎ. మొప్పలు

2. జలగ

( )

బి. ఊపిరితిత్తులు

3. పీతలు

( )

సి. వాయునాళాలు

4. కోతి

( )

డి. చర్మము

5. మాంగ్రూవ్

( )

ఇ.శ్వాసవేళ్ళు

 

 

ఎఫ్. లెంటిసెల్స్


జవాబులు:
1)సి; 2)డి; 3)ఎ; 4)బి; 4)ఇ.
 

#Tags