AP Schools Summer Holidays 2024 : స్కూల్స్‌కు వేసవి సెలవులను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఈసారి భారీగా హాలిడేస్‌.. మొత్తం ఎన్నిరోజుంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ సారి ఎండలు దంచికొట్టుతున్నాయి. ఇంట్లో నుంచి ఉద‌యం 9 దాటితే బ‌య‌టికి రావాలంటే.. పిల్లలు, పెద్ద‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్‌, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్‌ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్ర వడగాల్పులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ‌ అధికారులు తెలిపారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బడులకు ప్ర‌భుత్వం వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడింది. 

☛ AP Tenth Class Results 2024 Date and Time : ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్ల పున:ప్రారంభం.. :

అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులకు ఏప్రిల్‌ 23వ తేదీన చివ‌రి దినంగా ప్ర‌భుత్వం తెలిపింది. అలాగే ఏప్రిల్ 24వ తేదీ (బుధ‌వారం) నుంచి అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు జూన్ 11వ తేదీ (మంగ‌ళ‌వారం) వరకు వేసవి సెలవులు ఉంటాయి విద్యాశాఖ ప్ర‌క‌టించింది. తిరిగి ఈ స్కూల్స్ జూన్ 12వ తేదీ (బుధ‌వారం)  పున:ప్రారంభం అవుతాయ‌ని ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ వేర‌కు స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే స్కూల్స్‌కు దాదాపు 48 రోజులు పాటు సెల‌వులు ఇచ్చారు. ఇప్ప‌టికే టెన్త్ విద్యార్థులకు, ఇంట‌ర్ విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

☛ Telangana 10th Results 2024 Release Date : 10వ తరగతి ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..? అత్యంత వేగంగానే టెన్త్ ప‌రీక్ష‌ల వాల్యూయేషన్..!

2024లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే...

☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

 After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

#Tags