AP 10th Class 2024 సోషల్ స్టడీస్ మోడల్ పేపర్స్... ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి... ముఖ్యమైన టాపిక్స్ ఇవే!

ఆంధ్ర ప్రదేశ్ కొత్త సిలబస్, ఎక్సమ్ పాటర్న్ కి అనుగుణంగా సబ్జెక్ట్  నిపుణుల సహకారంతో ఏపీ టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మోడల్ పేపర్స్ సాక్షిఎడ్యుకేషన్ తయారు చేసింది. 

పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న నూతన పరీక్షల విధానం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మరింత పెరుగుతాయి. అంతర్గత ఏపీ పదో తరగతి పరీక్షల్లో తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ప్రశ్నాపత్రాలు ఇస్తారు. దీని వల్ల విద్యార్థులు ప్రశ్నలను సులువుగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

చదవండి ఏపీ పదో తరగతి చాప్టర్ వారీగా స్టడీ మెటీరియల్ 

సోషల్‌ స్టడీస్‌ లో ఒక మార్కు ప్రశ్నలు 12(12 మార్కులు), రెండు మార్కుల ప్రశ్నలు 8(16 మార్కులు), నాలుగు మార్కుల ప్రశ్నలు 8(32 మార్కులు), ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5(40 మార్కులు) ఉంటాయి

AP 10th Class Social Studies EM Model Papers

AP 10వ తరగతి సోషల్ స్టడీస్ TM మోడల్ పేపర్లు


సోషల్ స్టడీస్ ముఖ్యమైన టాపిక్స్

సోషల్‌ స్టడీస్‌లో మంచి మార్కులు పొందాలంటే.. సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. పాఠ్య పుస్తకంలోని ఏదైనా ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవాలి. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సాధన చేయడం ఎంతో అవసరం. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి.. సొంత పరిజ్ఞానంతో రాసే నైపుణ్యం పెంచుకోవాలి.

జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో భారతదేశం –భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి–ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం; సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను ప్రత్యేక దృష్టితో చదవాలి.

సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగల నుంచి అనుసరించారు తదితర కోణాల్లో చదవాలి. 
–బి.శ్రీనివాస్, సబ్జెక్ట్‌ టీచర్‌


 

#Tags