NCERT: ‘ప్రశస్త్‌’ ద్వారా దివ్యాంగ బాలల గుర్తింపు

సాక్షి, అమరావతి: ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి.. వారి సమగ్ర వివరాలను ‘ప్రశస్త్‌’ యాప్‌లో నమోదు చేస్తున్నారు.
‘ప్రశస్త్‌’ ద్వారా దివ్యాంగ బాలల గుర్తింపు

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమగ్ర శిక్ష ద్వారా అమలు చేస్తున్నారు. పిల్లల సంరక్షణ కేంద్రాలతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లోని సిబ్బంది గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: PRASHAST: దివ్యాంగ విద్యార్థుల కోసం ‘ప్రశస్థ్‌’

21 రకాల దివ్యాంగులను గుర్తించేందుకు 63 ప్రశ్నలను యాప్‌లో పొందుపరిచారు. పిల్లల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలున్న 36 వేల మంది పిల్లలను గుర్తించారు. వారికి ధ్రువపత్రాలు అందిస్తున్నారు. తద్వారా తగిన వైద్య సేవలు, సహాయక చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

చదవండి: Department of Education: ఈ పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు ఇవ్వాల్సిందే..

#Tags