AP SSC Supplementary Exams: ఈనెల 24 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

చిత్తూరు కలెక్టరేట్‌ : పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్‌ 3 వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ దేవరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 2006 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల పకడ్బందీ నిర్వహణకు చీఫ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు జూన్‌ ఒకటి నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.

After 10th Class and Inter Based Jobs 2024 : టెన్త్, ఇంటర్ అర్హ‌త‌తోనే.. వ‌చ్చే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవే..

ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలలో 1561 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని డీఈఓ వెల్లడించారు.

 

#Tags