Woman Sucess Story: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించిన హెడ్‌ కానిస్టేబుల్‌ కూతురు

ఆసిఫాబాద్‌రూరల్‌: పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నిఖిత కేతావత్‌. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం గ్రామానికి చెందిన సర్దార్‌ సింగ్‌, సంధ్య దంపతుల కుమార్తె నిఖిత ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటింది. సర్దార్‌ సింగ్‌ ప్రస్తుతం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉద్యోగరీత్యా సర్దార్‌ సింగ్‌ వివిధ ప్రాంతాల్లో పని చేయగా.. నిఖిత విద్యాభ్యాసం కూడా పలు ప్రాంతాల్లో కొనసాగింది. పీజీ, బీఈడీ పూర్తి చేసిన అనంతరం ఆమె పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది.

TSPSC AEE Final Results 2024: నిరుపేద కుటుంబం, ఎలాంటి కోచింగ్‌ లేకుండానే ఏఈఈ ఉద్యోగం సాధించిన రాజశేఖర్‌

ఈ క్రమంలో గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ లెక్చరర్‌, పీజీటీ, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల టీజీటీ, జేఎల్‌తోపాటు టీజీపీఎస్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లోనూ సత్తా చాటి గ్రూప్‌ 4, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికైంది. ప్రస్తుతం నిర్మల్‌లో సోషల్‌ వెల్ఫేర్‌ పరిధిలో డిగ్రీ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరినట్లు నిఖిత తండ్రి వెల్లడించారు.
 

#Tags