Hardware Engineer Success Story: ఇస్రోలో ఉద్యోగం వచ్చినా వదులుకుంది.. కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది

బీటెక్‌ పూర్తవగానే చాలామందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనో, లేదంటే ప్రభుత్వ కొలువు సాధించడమన్నది లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ పట్టుదలగా అనుకున్న లక్ష్యాన్ని ప్రయత్నిస్తే ఏ రంగంలో అయినా కళ్లు చెదిరే ప్యాకేజీ సొంతం చేసుకోవచ్చు అని నిరూపించింది రైతుబిడ్డ ఆశ్రిత. ఎలాంటి గైడెన్స్‌ లేకపోయినా సొంతంగా కష్టపడి హార్డ్‌వేర్‌ రంగంలో కొలువు సాధించి 52 లక్షల ఉద్యోగానికి ఎంపికైంది. ఆమె సక్సెస్‌ స్టోరీ మీకోసం..

ప్రతిభ ఉంటే ఎలాంటి రంగంలో అయినా సక్సెస్‌ కావొచ్చు అని నిరూపించింది.కరీంనగర్‌కు చెందిన ఆశ్రితది వ్యవసాయ కుటుంబం. తండ్రి రైతు కాగా, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న ఆశ్రిత ఇంట్లో తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Inspiring Story: సాఫ్ట్‌ బాల్‌లో ప్రతిభ.. చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం,నాసా సందర్శన

ఇందుకోసం ఏకంగా ఇస్రోలో ఉద్యోగం వచ్చినా తాను అనుకున్న లక్ష్యాన్నే ఎంచుకుంది.బీటెక్‌ పూర్తవగానే చాలామంది సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని ఎంచుకోవడానికి మక్కువ చూపిస్తుంటారు. కానీ ఈమె మాత్రం అందుకు భిన్నంగా హార్డ్‌వేర్‌ రంగాన్ని ఎంచుకుంది. సాఫ్ట్‌వేర్‌ కొలువును వద్దనుకొని ఐఐటీ, ఐఐఎస్‌సీల్లో ఎంటెక్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అందుకు తగ్గట్లే బీటెక్‌ పూర్తవగానే 2021లో గేట్‌ పరీక్ష రాసింది. 3వేల ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుతో ఏదో విధంగా ఎంటెక్‌ చేసేద్దాం అనుకోలేదామె. తాను అనుకున్నట్టుగా ప్రతిష్టాత్మక టాప్‌ కాలేజీల్లోనే ఎంటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో వచ్చిన సీటును వద్దనుకొని ఓ కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ అయి మరోసారి గేట్‌ పరీక్ష రాసింది.

NEET UG 2024 Hearing Highlights: నీట్‌ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆమె కష్టానికి తగ్గట్లుగానే ఆల్‌ ఇండియాలో 36వ ర్యాంకు సాధించింది. దీంతో ప్రతిష్టాత్మక ప్రభుత్వ కంపెనీలైన ఇస్రో, డీఆర్‌డీఓ, బార్క్‌ వంటి సంస్థల్లో ఉద్యోగాలు ఆశ్రితను వెతుక్కుంటూ వచ్చాయి. అయినా సరే తాను అనుకున్న విధంగా ఎంటెక్‌ పూర్తిచేయాలని నిశ్చయించుకుంది. తాజాగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి 52 లక్షల ప్యాకేజీ సాధించి తన కష్టం వృథా కాలేదని నిరూపించింది. రైతు కుటుంబం నుంచి వచ్చి, ఎలాంటి మార్గదర్శకం లేకపోయినా సొంతంగా కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 

#Tags