Vidadala Rajini: ప్ర‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో ఒక మెడిక‌ల్ కాలేజీ.. త్వ‌ర‌లోనే 16 మెడిక‌ల్ కాలేజీల‌ను..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.
Vidadala Rajini, AP Health Minister

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అలాగే త్వ‌ర‌లోనే 16 మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు  చేస్తామ‌న్నారు. ప్ర‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో ఒక మెడిక‌ల్ కాలేజీ నిర్మాణం  చేప‌డ‌తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

#Tags