Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Free training

ఉద్యోగం లేదని ఎంతో మంది నిరుద్యోగులు సతమత పడుతుంటారు…. చదువులేదని కొంత మంది.. కుటుంబ పరిస్థితులతో కొంత మంది.. ఇలా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం లేక ఇంటికే పరిమితం అవుతూ.. రోజు ఇబ్బంది పడుతుంటారు.

ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రీడ్ ఇండియా ఎక్స్టన్షన్ సెంటర్ వారు నిరుద్యోగులకు చక్కటి శిక్షణ అందిస్తున్నారు. ఇదే క్రమంలోనే బైరెడ్డిపల్లి గ్రామంలోని ఇండియన్ బ్యాంక్ ఆవరణంలో ఉన్నటువంటి జయలక్ష్మి కాంప్లెక్స్ నందు మండలంలోని నిరుద్యోగులకు చక్కటి ఉపాధి కల్పించే దిశగా ,ఉద్యోగ భరోసాగా శిక్షణ అందిస్తున్నారు పడ కంట్ల శైలజా.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐడీప్రూఫ్ ఉండి, 18 సంవత్సరాలు పైబడిన యువతి, యువకులకు రీడ్ ఇండియా ఎక్సటెన్షన్ సెంటర్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ, అల్లికలు, బ్యూటీ పార్లర్ వంటి వాటిపై శిక్షణ ఇస్తామన్నారు.

ఆసక్తి కలవారు శిక్షణ పొంది సర్టిఫికెట్ పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పడకంట్ల శైలజా మాట్లాడుతూ ఏపీలో 62 సెంటర్స్ లో రీడ్ ఇండియా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయన్నారు.

ఈ సంస్థ ప్రధాన ఉదేశ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే సంకల్పం పెట్టుకొని ,ఈ సంస్థలో అనుభవజ్ఞులైన ట్రైనర్స్ ను పెట్టుకొని వారి ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణక్రమంగా 3 నెలలు పాటు ఇవ్వడం జరుగుతుందన్నారు.

3 నెలలు పాటుటైలరింగ్ లో బేసిక్ నుండి నేర్పించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రధానంగా గుడ్డపై కుట్లు ఎలా పడుతున్నాయని…కటింగ్ విధానం, డిజైన్ ఎలా చెయ్యాలి అనే విధానంపై చక్కగా నేర్పిస్తున్నారు.

ఒక్కరోజు శిక్షణ, మరొక రోజు ప్రాక్టీస్ ఇచ్చి మరీ నేర్పిస్తున్నారు. వచ్చేటువంటి నిరుద్యోగులు కూడా చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకొంటున్నారు. 2016 నుండి సుమారు 500 మంది పైబడి నిరుద్యోగులు ఇక్కడ శిక్షణ పొంది, బయట జాబ్ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

ఇందులో శిక్షణ పొందిన వారు ,నివాసం ఉన్న చోటే ఉపాధి పొందవచ్చునన్నారు. సర్టిఫికేట్ పెట్టుకొని గార్మెన్స్,పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఉపాధి పొందవచ్చన్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగంకల్పించే బాధ్యత కూడా తీసుకొంటున్నారు.

సంపూర్తిగా శిక్షణ ఇచ్చే సంస్థగా పేరుపొందింది.. ఈ సువర్ణావకాశం ప్రతి ఒక్క నిరుద్యోగులు కల్పించుకోవాలని కోరారు. ఒక్క ఐడి ప్రూఫ్ తో ఎవ్వరైనా సరే ఆంధ్ర,కర్ణాటక,తమిళనాడు వాసులు కూడ అర్హులన్నారు. ఆసక్తి కలవారు పూర్తి వివరాలు కోసం ఈ నెంబర్ ను సంప్రదించాలని 70135 70003 కోరారు.

 

#Tags