RBI online Quiz: యువతకు Good News క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్న RBI... గెలిస్తే..లక్షాధికారి మీరే...

RBI online Quiz

మదనపల్లె సిటీ: లక్షాధికారి కావడానికి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యువతకు సువర్ణావకాశం కల్పిస్తోంది. ఆర్‌బీఐ 90 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఏదేని డిగ్రీ చదువుతున్న వారికి ఆర్‌బీఐ 90 క్విజ్‌ పేరిట పోటీలు నిర్వహిస్తుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఈనెల 17వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈనెల 19 నుంచి 21వ తేదీ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు నిర్వహిస్తారు.

Clerk Jobs in Government Offices: ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్‌ ఉద్యోగాలు: Click Here

అర్హులు ఎవరంటే...

2024 సెప్టెంబర్‌ 1 నాటికి 25 ఏళ్లలోపు ఉండి ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. www.rbi90quiz.in లో పేరు,గుర్తింపు కార్డు నంబరు వంటివి నమోదు చేయాలి. ఎలాంటి ప్రవేశ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక కాలేజీ నుంచి ఎంత మందైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

నాలుగు దశల్లో పోటీలు

పోటీలు జిల్లా, రాష్ట్ర, జోనల్‌, జాతీయ స్థాయిల్లో ఉంటాయి. బృందానికి కనీసం ఇద్దరు ఉండాలి. తొలుత జిల్లా స్థాయి పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో 36 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వీటికి 15 నిమిషాల సమయం ఉంటుంది. అంధులకు అదనంగా మరో 15 నిమిషాలు ఇస్తారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన 90 బృందాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన బృందాలను జోనల్‌గా విభజించి అనంతరం జాతీయ స్థాయికి ఎంపిక చేసి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆంగ్లం, హిందీ భాషల్లో పోటీలు ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థ, తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి.

వసతి,రవాణా ఖర్చులు

జిల్లా స్థాయి పోటీలు మాత్రమే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆ తర్వాత జరిగే రాష్ట్ర, జోనల్‌, జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు రవాణా, వసతి ఖర్చులను ఆర్‌బీఐ భరిస్తుంది. విద్యార్థి వెంట ఒక అధ్యాపకుడు వెళ్లడానికి అయ్యే వ్యయాన్ని సైతం ఆర్‌బీఐ చూసుకుంటుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో అందజేసిన వివరాలు తప్పుగా తేలితే అనర్హులుగా నిర్ణయిస్తారు.

#Tags