Lecturer posts: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Lecturer posts

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల, ఇచ్చోడలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీని వాస్‌ ప్రకటనలో తెలిపారు.

ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, ఆంగ్లం, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టును భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఆంగ్లం సబ్జెక్టు ఖాళీగా ఉందని తెలిపారు. ఈనెల 7లోగా ఆదిలాబాద్‌లోని సైన్స్‌ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి 8న డెమో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

#Tags