Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు జాబ్ మేళా
ఉయ్యూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనశాఖ, డీఆర్డీఏ, ఎన్ఏసీ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు డిసెంబర్ 17వ తేదీ ఉయ్యూరులో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్ డిసెంబర్ 15వ తేదీ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఉయ్యూరులోని బస్టాండు సెంటర్ శ్రీలంక కాలనీలోని ఎన్ఏసీ ట్రైనింగ్ సెంటరులో జాబ్ మేళా జరుగుతుందన్నారు. బజాజ్ క్యాపిటల్, మెడ్స్ హెల్త్ సర్వీసెస్, గూగుల్ పే ఇతర ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tomorrow Job Mela నిరుద్యోగ యువతీ యువకులకు రేపు జాబ్‌మేళా హైదరాబాద్‌లో ఉద్యోగాలు
గన్నవరంలో..
గన్నవరం మండలంలోని దావాజిగూడెంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 17వ తేదీన జాబ్‌మేళా ఏర్పాటు చేసిన జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రింగిల్ ఐటీ వెంచర్స్, యూనివర్శల్ ప్రింట్ సిస్టమ్స్, టాటా క్యాపిటల్, రమా క్లాత్ స్టోర్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.