Job Mela: రేపు క‌ర్నూలులో జాబ్‌మేళా.. మిస్ చేసుకోకండి

క‌ర్నూలు సిటీ: నైపుణ్యాభివ‌`ద్ధి, శిక్ష‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 3వ తేదీ జాబ్‌మేళా నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా ఉపాధి క‌ల్ప‌నాధికారి పీ దీప్తి 1వ తేదీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌ర్నూలులోని బిర్లాగేట్ పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న న్యాక్ కేంద్రంలో ఉద‌యం 9 గంట‌ల‌కు జాబ్‌మేళా ప్రారంభం అవుతుంద‌ని పేర్కొన్నారు. జాబ్‌మేళాలో ఎల్ఎన్‌టీ, పేటీఎం, ఎస్‌బీఐ కార్డ్స్ అమ‌ర్‌రాజా గ్రూప్, అమేజాన్ వేర్ హౌస్ కంపెనీలు పాల్గొంటాయ‌ని తెలిపారు. 

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియెట్‌, ఐటీఐ, డిప్ల‌మో, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ చదివి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వ‌య‌సు ఉన్న వారు అర్హులన్నారు.

ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెలకు రూ.10 నుంచి రూ.20 వేల వరకు వేత‌నం ఉంటుంద‌న్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 81424 10410, 90592 90821 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌న్నారు.

Job Fair: గుడ్‌న్యూస్‌.. రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే..

#Tags