Good News for Anganwadis: అంగన్‌వాడీలకు సొంత భవనాలు

Good News for Anganwadis

విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం జగన్‌ నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నాడు–నేడులో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను సమకూరుస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లాకు 57 భవనాలను మంజూరు చేయగా 32 చోట్ల నిర్మాణాలు 90 శాతం మేరకు పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తయిన భవనాల్లో చిన్నపాటి పనులు ఉండగా వాటిని వేగంగా పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మిగిలిన భవనాలు రూఫ్‌స్థాయిలో ఉన్నాయి.

Click Here: అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

రూ.9.12 కోట్ల ఖర్చు

జిల్లాలో 57 భవనాల నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.16 లక్షల చొప్పున మొత్తం రూ.9.12 కోట్లను ఖర్చు చేస్తున్నారు. భవన నిర్మాణంతో పాటు ఫర్నిచర్‌ ఏర్పాటుచేస్తారు. కిచెన్‌, హాల్‌, క్లాస్‌ రూమ్‌, టాయిలెట్‌ తదితర సౌకర్యాలతో కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి.

దశల వారీగా..

జిల్లాలో మొత్తం 1,562 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 626 సెంటర్లను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. దశల వారీగా వీటన్నింటికీ సొంత భవనాలు సమకూర్చనున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం ఊసే ఎత్తలేదు.

 

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణం

మండలం నిర్మాణాలు

ఆచంట 7

పెనుగొండ 1

పెనుమంట్ర 2

పోడూరు 9

భీమవరం 2

వీరవాసరం 2

మొగల్తూరు 10

నరసాపురం 2

పాలకొల్లు 4

యలమంచిలి 4

పెంటపాడు 3

తాడేపల్లిగూడెం 2

అత్తిలి 4

ఆకివీడు 1

కాళ్ల 1

పాలకోడేరు 2

ఉండి 1

 

నిర్మాణం.. శరవేగం

57 కేంద్రాలకు భవనాల మంజూరు

32 నిర్మాణాలు 90 శాతం పూర్తి

ఒక్కో భవనానికి రూ.16 లక్షల కేటాయింపు

మొత్తంగా రూ.9.12 కోట్ల నిధులు

చురుగ్గా నిర్మాణాలు

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రా ల భవనాల నిర్మాణాలు చు రుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 23 భవనాల నిర్మాణం పూర్తికాగా, 32 భవనాలు రూఫ్‌ దశలో, మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన భవనాల్లోకి వేగంగా అంగన్‌వాడీ కేంద్రాలను మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. నూతన భవనాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.– సుజాతారాణి, పీడీ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ

చాలా సంతోషం

మా గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం చాలా కాలంగా అద్దె భవనాల్లో కొనసాగుతుంది. ప్రభుత్వం మా అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం మంజూరు చేయగా దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చింది. అన్ని సౌకర్యాలు ఉండేలా సొంత భవనం నిర్మించడం చాలా సంతోషంగా ఉంది.– ఎ.మాధవి, అంగన్‌వాడీ కార్యకర్త, అబ్బిరాజుపాలెం

అంగన్‌వాడీ కేంద్రాలు

సొంత భవనాలు ఉన్నవి 548

అద్దె భవనాల్లో ఉన్నవి 626

ఫ్రీ రెంట్‌లో ఉన్నవి 388

మొత్తం 1,562

#Tags