February Month 2024 Holidays Details News : ఫిబ్రవరి నెలలో సెలవుల లిస్ట్ ఇదే.. ఈ నెలలో స్కూల్స్ , కాలేజీల విద్యార్థులకు నిరాశే..!
ఈ నెలలో శనివారం, ఆదివారాలు కాకుండా... కేవలం ఒక్క రోజు మాత్రమే స్కూల్స్, కాలేజీలకు సెలవు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 16వ తేదీ (శుక్రవారం) రథ సప్తమి సందర్భంగా స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. అంతే కానీ ఈ ఫిబ్రవరి నెలలో ఎటు వంటి పండగ సెలవులు లేవు. అలాగే ఏదన్నా అనుకోని బంద్‌లు.. మొదలైన వాటికి సెలవులు వచ్చే అవకాశం ఉంది.
బ్యాంకు లావాదేవీలు తరుచుగా నిర్వహించే వారికి బిగ్ అలర్ట్. ఫిబ్రవరిలో ఈ ఏడాది 29 రోజులు ఉన్నాయి. అయితే, అందులో 18 రోజుల పాటు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. మిగిలిన 11 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో సాధారణ సెలవులతో పాటు పండుగలు, నేషనల్ హాలీడేస్, స్థానిక సెలవులు ఉంటాయి. అలాగే ఆదివారంతో పాటు రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇప్పటికే ఫిబ్రవరి నెలకు సంబంధించిన బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఉన్న వారు తప్పనిసరిగా ఈ సెలవుల గురించి తెలుసుకోవడం మంచిది. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి. ఇంటర్నెట బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీసెస్ ద్వారా ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ మోడ్ ద్వారా బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ లావాదేవీలు నిర్వహించవచ్చు.
ఫిబ్రవరి నెలలో సెలవుల లిస్ట్ ఇదే..
➤ ఫిబ్రవరి 4వ తేదీ 2024 : ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
➤ ఫిబ్రవరి 10వ తేదీ : ఈ తేదీన రెండవ శనివారం వస్తున్నందును దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
➤ ఫిబ్రవరి 11వ తేదీ : ఈ రోజు ఆదివారం కాబట్టి బ్యాంకులు మూసి ఉంటాయి.
➤ ఫిబ్రవరి 14వ తేదీ : వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
➤ ఫిబ్రవరి15వ తేదీ : ఈ రోజు నగై ని నది ఉత్సవాల సందర్భంగా మణిపూర్ లో బ్యాంకులు బంద్ ఉంటాయి.
➤ ఫిబ్రవరి 18వ తేదీ : ఈ రోజున ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
➤ ఫిబ్రవరి 19వ తేదీ : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సంతర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
➤ ఫిబ్రవరి 20వ తేదీ : ఈ రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు హాలీడే ఉంటుంది.
➤ ఫిబ్రవరి 24వ తేదీ : రెండో శనివారం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
➤ ఫిబ్రవరి 25వ తేదీ : ఆదివారం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
➤ ఫిబ్రవరి 26వ తేదీ : న్యోకుమ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
2024లో సెలవులు వివరాలు ఇవే..
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్