Anganwadi Posts: 10th Class అర్హతతో అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు

Anganwadi jobs

కర్నూలు (అర్బన్‌): అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సాధికారిత అధికారిణి పీ వెంకటలక్షుమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 11 మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒక మినీ అంగన్‌వాడీ కార్యకర్త, 84 మంది ఆయాలను నియమించనున్నట్లు పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు 10వ తరగతి, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 1–07–2023 నాటికి 35 సంవత్సరాల లోపు ఉండేవారు అర్హులని తెలిపారు.

ఈ నెల 7తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయ పనివేళల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రందించాలన్నారు.

#Tags