Anand Mahindra: ఆటో ప్లాంట్‌ నుంచి సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మ్యాన్‌గా,ఆనంద్‌ మహీంద్రా కెరీర్‌ సాగిందిలా..

ప్రముఖ  పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్‌ చేస్తుంటారు. అనేక స్ఫూర్తిదాయక కథనాలను షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఆయన తాజాగా తయారీ రంగంలోని హీరోలోపై ఎలన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌కు స్పందించారు.

తయారీ రంగంలో పనిచేసే వారిని ఉద్దేశిస్తూ ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేస్తూ.. గ్యారేజీలో ఒంటరిగా కూర్చొనే ఆవిష్కర్తల గురించి సినిమాలు వచ్చాయి. కానీ తయారీ రంగానికి చెందిన వారి గురించి ఒక్క సినిమా కూడా రాలేదు'' అని అభిప్రాయపడ్డారు. ఆ ట్వీట్‌కు ఆనంద్‌ మహింద్రా స్పందిస్తూ తయారీ రంగంలోని హీరోల గురించి సినిమాలు రావాల్సిందేనని మస్క్‌తో అంగకీరించారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. 


అక్కడ్నుంచే ఆనంద్‌ మహీంద్రా కెరీర్‌..
ఆటో ప్లాంట్‌లోని ఉత్పత్తి విభాగంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. ఎక్కువ సంఖ్యలో వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం అక్కడ పనిచేసే వారి నిరంతర కృషి, సమస్య పరిష్కారంలో చూపించే నైపుణ్యాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. బయోపిక్‌ సినిమాలకు వీళ్లు నిజంగా అర్హులు. మహీంద్ర కార్ల తయారీకి సంబంధించి మేం రూపొందించే షార్ట్‌ ఫిల్మ్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి రంగంలో మరిన్ని సినిమాలను తెరకెక్కించాలని అంటూ ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌ చేశారు. 

సినిమాల నుంచి బిజినెస్‌ మ్యాన్‌గా..

మహీంద్రా అండ్‌ మహీంద్రా వ్యాపార సామ్రాజ్యానికి మూడో తరం వారసుడు.. 1953లో హరీష్‌ , ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు ఆనంద్‌ మహీంద్రా. తమిళనాడులో స్కూలింగ్‌ పూర్తి చేసిన ఆనంద్‌ మహీంద్రా.. సినిమాలపై ఉన్న మక్కువతో 1977లో హర్వర్డ్‌ యూనివర్సిటీలో ఫిల్మ్‌మేకింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లారు.

కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మనసు మార్చుకుని తిరిగి వ్యాపారం వైపు మొగ్గు చూపారు. ఆనంద్ మహీంద్రా కంపెనీలోకి అడుగుపెట్టిన తరువాత ఆటోమొబైల్ రంగాన్ని విసృతంగా అభివృద్దిపరిచాడు. 

వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన ఒక బిలియనీర్​గా, వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎంతో మందికి స్పూర్థిగా నిలుస్తున్నారు. 

#Tags