AEE Ranker Success Story : రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడు.. సంక‌ల్ప బ‌లంతో ఏఈఈ ఉద్యోగం కొట్టాడిలా... కానీ

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ యువకుడి ఆత్మస్థైర్యం ముందు వైకల్యం ఓడింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగం అతడి సొంతమయ్యింది. చిట్యాలకు చెందిన ఎండీ అక్బర్‌, పర్వీన్‌ దంపతుల కుమారుడు అర్షద్‌ బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న సమయంలో 2000 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడు. చికిత్స కోసం రెండేళ్లు పట్టింది.

Top 10 Engineering/M.Tech Colleges: బీటెక్‌/ఎంటెక్‌ చేయాలనుకుంటున్నారా? టాప్‌ కాలేజీల లిస్ట్‌ ఇదే

చదువుపై ఉన్న మమకారానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడుకావడంతో ఎంటెక్‌ కూడా పూర్తిచేశారు. వైకల్యం వల్ల తాను భవిష్యత్తులో ఒకరికి భారంకాకూడదని, తన కాళ్లపై తాను నిలబడాలని సంకల్పించుకున్న అర్షద్‌ పట్టువీడకుండా పలు రకాల పోటీ పరీక్షలకు హాజరవుతూ వస్తున్నారు. 

Top 10 Central Universities in India: దేశంలోని టాప్‌-10 యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు చోటు

ఫలితాలు ఎలా ఉన్నా నిరుత్సాహాన్ని దరిచేరనీయకుండా ఏదో సాధించాలని ఉద్దేశంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగారు. టీజీపీఎస్సీ ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఏఈఈ ఫ‌లితాల్లో ప్రతిభ కనబరిచి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు పోస్టుకు ఎంపికయ్యారు. ఇబ్బందికరంగా ఉన్న సమయంలో తనకు తోడుగా ఉన్న తల్లిదండ్రుల బాధ్యతను ఇక నుంచి తాను తీసుకుంటానని అర్షద్‌ పేర్కొన్నారు.

#Tags