Ekalavya Adarsh ​​Gurukula School: చదువుకు చక్కని ప్రాధాన్యం

గుమ్మలక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం చదువుకు చక్కని ప్రాధాన్యమిస్తోందని, అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా రాణించాలని జాతీయ ఎస్టీకమిషన్‌ సభ్యుడు అనంతనాయక్‌ సూచించారు.
అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా రాణించాలని జాతీయ ఎస్టీకమిషన్‌ సభ్యుడు అనంతనాయక్‌

గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకుని సంతోషం వ్యక్తంచేశారు. చక్కని మెనూ, నాడు–నేడుతో సర్కారు బడులకు ఆధునిక సదుపాయాల కల్పన, వివిధ పథకాలతో విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటునందించడం బాగుందన్నారు. విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ముందుకు ఏకలవ్య పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. కొండ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న 4జి సెల్‌ టవర్స్‌ను సూచిస్తూ ఏర్పాటుచేసిన స్టాల్‌ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.  

Nadu Nedu: Revolutionizing AP Govt Schools with AI Technology #sakshieducation

ఏకలవ్య పాఠశాలను సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు

#Tags