Kuchipudi Admissions : కూచిపూడి నాట్యంలో ప్రవేశాలపై విద్యార్థుల్లో గందరగోళం..
కూచిపూడి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో 2024–25 విద్యా సంవత్సరానికి కూచిపూడి నాట్యంలో ప్రవేశాలు ఉంటాయో.. లేదో తెలియక నాట్య విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణలో ఉంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి సేవల గడువు జూన్ 2వ తేదీతో ముగియటంతో విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం వరకే నోటిఫికేషన్ విడుదల చేసింది.
Free Training: బ్యూటీకేర్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ.. అర్హులు వీరే..
దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆ విశ్వవిద్యాలయం పరిధిలోని కూచిపూడి, రాజమహేంద్రవరం, శ్రీశైలం కళాపీఠాల ప్రవేశాలపై సందిగ్ధత ఏర్పడింది. దీనిపై కూచిపూడిలో స్థానికంగా ఉన్న అధ్యాపకులకు కూడా సరైన సమాచారం లేదు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి.. అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేసి విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
Polycet Spot Admissions 2024 : ఈనెల 31న పాలిసెట్ 2024 స్పాట్ అడ్మిషన్లు.. ఈ పత్రాలు తప్పనిసరి..