Teachers Training: ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో మదనమోహన మాలవీయ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా శాన్‌స్క్రీట్ అండ్ ఇట్స్ కాంటెంపరరీ రిలవెన్స్ అనే అంశంపై జరిగిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది.
ప్రాచీన అంశాలను ఆధునిక పద్ధతులలో విద్యార్థులకు బోధించాల్సిన మెళకువలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధ్యాపకులకు శిక్షణనిచ్చారు. అలాగే అధ్యాపకులు నిరంతర విద్యార్థిగా అధునాతన అంశాలపై నైపుణ్యం పెంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మదనమోహన్ మాలవీయ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీధర్‌రావు, డాక్టర్ ఏ.చారుకేష్, దేశంలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి శిక్షణ కోసం విచ్చేసిన సుమారు 35 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
#Tags