DEO Mareddy Anuradha: విద్యార్థుల సామర్థ్యాల అంచనా కోసమే శ్లాస్‌ పరీక్ష

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో సామర్థ్యాలను అంచనా వేసేందుకు మంగళవారం ఎస్‌సిఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్లాస్‌ (స్టేట్‌ లర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులంతా నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షను జిల్లాలోని 23 మండలాల పరిధిలో 121 పాఠశాలలకు చెందిన 4010 మంది విద్యార్థులకు నిర్వహించారు. కాగా 3724 మంది విద్యార్థులు హాజరై 98.86 శాతం హాజరు నమోదైంది. సంబంధిత శ్లాస్‌ పరీక్షను ఎంఈఓల పర్యవేక్షణలో సీఆర్‌పీలు నిర్వహించారు. ఈ శ్లాస్‌ పరీక్షకు ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగింది.

విద్యార్థుల సామర్థ్యాల అంచనా కోసమే శ్లాస్‌ పరీక్ష
విద్యార్థుల్లో సామర్థ్యాలను అంచనా వేసేందుకే శ్లాస్‌ పరీక్షను నిర్వహించామని డీఈఓ మర్రెడ్డి అనురాధ పేర్కొన్నారు. మంగళవారం కడపలోని కాగితాలపెంట, ఇందిరానగర్‌ మండల ప్రాథమిక పాఠశాలతోపాటు సీకెదిన్నె మండలంలోని పలు పాఠశాలలను డీఈఓ తనిఖీ చేసి పరీక్ష నిర్వహణను పరిశీలించడంతోపాటు వసతులపై విద్యార్థులతో ఆరా తీశారు. అలాగే డీసీఈబీ సెక్రటరీ శంకరయ్య, ఏఎంఓ ధనలక్ష్మి, ఎంఈఓలు పాలెం నారాయణ, ఇర్షాద్‌ ఆహ్మద్‌ కడప నగరంతోపాటు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

చదవండి: School Exams: షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి

#Tags