KGBV Schools : కేజీబీవీల్లో బోధ‌న, బోధ‌నేత‌ర ఉద్యోగాల‌కు రోస్ట‌ర్ విధానం

శ్రీకాకుళం: శ్రీకాకుళం సర్వ శిక్షా అభియాన్‌ ద్వారా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీలో రోస్టర్‌ విధానం పాటించాలని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, పేడాడ కృష్ణారావు గురువారం డిమాండ్‌ చేశారు. సర్వశిక్షా అధికారులు అక్టోబర్‌ 23వ తేదీ అర్ధరాత్రి విడుదల చేసిన సీఆర్టీ, పీజీటీ, పార్ట్‌ టైం టీచర్లు తదితర ఉద్యోగాల నియామకపు జాబితాలో ఏపీఎస్‌ఎస్‌ఎస్‌ రూల్‌–22, జీఓ–77 ప్రాప్తికి మెరిట్‌ కం రోస్టర్‌ విధానం పాటించలేదని తప్పు పట్టారు. దీని వల్ల రిజర్వ్‌డ్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌ ప్రాప్తికి సర్టిఫికెట్స్‌ పరిశీలన తరువాత ప్రొవిజనల్‌ జాబితాలను మెరిట్‌ కం రోస్టర్‌ పద్ధతిలో 1:3కాకుండా 1:20లో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవటం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags