Parakh National Survey 2024 : డిసెంబర్ 4న పకడ్బందీగా పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ–2024 పరీక్షలు
కడప: జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 4వ తేదీన 3,6,9 తరగతుల విద్యార్థులకు నిర్వహించనున్న పర్ఫార్‌మెన్స్ అసెస్‌మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్‌మెంట్ (పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ–2024) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పేర్కొన్నారు. గురువారం కడప సీఎస్‌ఐ స్కూల్‌లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్‌కు రాష్ట్రీయ సర్వేక్షణ –2024 పరీక్ష నిర్వహణపై ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tenth Public Exam Fees : టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు గడువు పెంపు.. ఈ తేదీలోగా!
ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పరిశీలించడంతోపాటు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహిస్తోందన్నారు. ఇందు కోసం జిల్లాలో 139 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఇందులో ఒక్కో పాఠశాల నుంచి తరగతికి 30 మంది చొప్పన మూడు తరగతులకు సంబంధించిన విద్యార్థులను ఎంపిక చేశారన్నారు. వీరికి డిసెంబర్ 4న జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలో పరీక్ష జరుగుతుందన్నారు. డీసీఈబీ సెక్రటరీ విజయభాస్కర్‌రెడ్డి, ఆర్‌పీలు వెంకటేశ్వరరెడ్డి, ఖాసింఖాన్ తదితరులు పాల్గొన్నారు.