Scholarship Exam : ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌కు 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు.. ప‌రీక్ష తేదీ!

రాయచోటి: జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష కోసం 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Navodaya Vidyalaya : న‌వోద‌య విద్యాల‌యంలో 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ఈ తేదీలోగా..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత, వసతి సౌకర్యం లేని ఏపీ మోడల్‌ స్కూల్‌లలో 8వ తరగతి చదువుతూ, కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. డిసెంబర్‌ 8వ తేదీన జరిగే ఈ పరీక్షకు సెప్టెంబర్‌ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

International Left-Handers Day: ఈ ప్రముఖలు లెఫ్ట్‌ హ్యాండర్స్ అని మికు తేలుసా?

#Tags