Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు పెంపు హర్షణీయం

పాలకొల్లు సెంట్రల్‌: ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు ను ఎనిమిదేళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీఓ ఇవ్వ డం హర్షణీయమని అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (అపుస్మా) జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీవీఎస్‌ పాపారావునాయుడు అన్నారు.

శుక్రవారం ఉల్లంపర్రు మాంటిస్సోరిస్‌ స్కూల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపారావునాయుడు మాట్లాడు తూ అసోసియేషన్‌ తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపును 3 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పెంచుతూ జీఓ 90 జారీ చేయడం శుభపరిణామమని అ న్నారు. ఆఫ్‌ రికగ్నినేషన్‌ కొనసాగించడం, రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అన్ని పాఠశాలలకు ఆఫ్‌లైన్‌ విధానాన్ని కొనసాగించడం వంటి అంశాలపై జీఓ నవంబర్‌ 90తో రాష్ట్రంలోని వేల పాఠశాలలకు మేలు చేకూరుతుందన్నారు. వచ్చే సంవత్సరానికి రెన్యూవల్‌ కోసం డిసెంబర్‌ 31 వరకూ గడువు ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తూ జీఓను జారీ చేసిన సీఎం జగన్‌, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మె ల్సీ ఎంవీ రామచంద్రరెడ్డి, పి.చంద్రశేఖర్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అపుస్మా జిల్లా కార్యదర్శి ఏవీవీ సుబ్బరాజు, రాష్ట్ర ఈసీ మెంబర్‌, జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ మెంబర్‌ ఎం.రామ్‌ప్రసాద్‌, ఈసీ విద్యాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: CTET 2024 Notification: సీటెట్‌-2024 నోటిఫికేషన్‌ వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

#Tags