IIT Delhi Launches New Course: 'బిటెక్ ఇన్ డిజైన్'పేరుతో సరికొత్త కోర్సును ప్రారంభించిన 'ఐఐటీ' ఢిల్లీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ఢిల్లీ, ఈ విద్యా సంవత్సరం నుంచి 'బిటెక్ ఇన్ డిజైన్'అనే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రారంభిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకును బట్టి ఇందులో ప్రవేశం తీసుకుంటారు. అంతేకాకుండా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ డిజైన్‌ (UCEED) అనే పరీక్షలో కూడా అభ్యర్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది.

NEET UG Revised Results: నీట్‌ యూజీ 2024 తుది ఫలితాల్లో గందరగోళం

ప్రస్తుతమున్న టెక్నాలజీ, సిస్టమటిక్‌ డిజైన్‌ ప్రాసెస్‌, సోషియో టెక్నికల్‌ సిస్టమ్స్‌ వంటి వాటిపై ఈ కోర్సులో శిక్షణ కల్పిస్తారు. ఐఐటీ ఢిల్లీలో సైన్స్‌, ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌,హ్యుమానిటీస్,సోషల్ సైన్సెస్ వంటి పలు విభాగాలకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బిటెక్ ఇన్ డిజైన్' అనే సరికొత్త కోర్సును ప్రవేశపెట్టారు.

Engineering Seats Increased 2024 : మ‌రో 9000 ఇంజినీరింగ్ సీట్లు.. రేప‌టి నుంచే వెబ్‌ ఆప్షన్లు..

ఇది టెక్నాలజీ, డిజైన్‌కు సంబంధించిన ట్రాన్స్ డిసిప్లినరీ ప్రోగ్రామ్. ఈ కోర్సు గురించి డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ జ్యోతి కుమార్‌ మాట్లాడుతూ.. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు దీర్ఘకాలంలో విభిన్నమైన కెరీర్‌ మార్గాలను ఎంచుకోవచ్చు అని తెలిపారు. 

#Tags