School Holidays : భారీ వ‌ర్షాల కార‌ణంగా విద్యా సంస్థ‌ల‌కు సోమ‌వారం కూడా సెల‌వు..!

రాష్ట్రాల్లో రెండు రోజుల‌నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే, ప్ర‌భుత్వాలు, వాత‌వ‌ర‌ణ కేంద్రాలు పాఠ‌శాల‌ల‌కు అలాగే క‌ళాశాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే, రానున్న రోజుల్లో ఒక వేళ సోమ, మంగ‌ళ‌వారాల్లో కూడా ఇలాగే వ‌ర్షాలు కొన‌సాగితే మాత్రం మ‌ళ్ళీ సెలవులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంటుందని వాతావ‌ర‌ణ కేంద్రాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, నాగ్‌పూర్, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. అయితే, దేశంలో చాలా రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండ‌డంతో జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

Increase in Fees : దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న విద్యా వ్యయం.. ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు ఫీజులు పెంపు!

కొన్ని ప్రాంతాల్లో బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌డ‌మే క‌ష్ట‌మైంది. ప‌లు చోట్ల‌లో మాత్రం విరామం లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా బ‌డులు, కాలేజీలు మూసివేయాల‌ని ప్ర‌భుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో కన్వర్ యాత్ర కారణంగా ఒక‌టి నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు శనివారం నుంచి సోమవారం వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్ర‌భుత్వం. అయితే, అక్క‌డి డిప్యూటీ సీఎం జారీ చేసిన‌ ఆదేశాల మేరకు జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి వీరేంద్రకుమార్ సింగ్ ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని పాఠశాలలను ప్ర‌క‌టించిన తరగతుల‌ వరకు మూసి ఉంచాలని తెలిపారు.

New Anganwadi Schools: గుడ్‌న్యూస్‌ ఇక నుంచి కొత్త అంగన్‌వాడీలు ఎందుకంటే...

ఇక్క‌డ ఇలా ఉంటే, వారణాసి జిల్లా పాలనా యంత్రాంగం సావన్ మాసంలో సోమవారం అన్ని పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయంలో రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం కూడా వారణాసి పరిపాలన సోమవారం పాఠశాలను మూసివేయాలని నిర్ణయించింది.

IT Work Hours: పెరగనున్న పని గంటలు.. ఇదే జరిగితే.. టెకీల పరిస్థితి ఏంటి?

#Tags